దేవీ నవరాత్రులు.. బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు..!

By telugu news teamFirst Published Oct 7, 2021, 1:28 PM IST
Highlights

దేవీ నవరాత్రులలో మొదటి రోజు శ్రీ బాలత్రిపురసుందరిదేవి అవతారం. అమ్మవారి ప్రసాదములు తయారు చేసే విధానం.

దేవీ నవరాత్రులలో మొదటి రోజు శ్రీ బాలత్రిపురసుందరిదేవి అవతారం. అమ్మవారి ప్రసాదములు తయారు చేసే విధానం.  

1. మొదటి రోజు శ్రీ బాలత్రిపురసుందరిదేవి అమ్మవారి అవతారం.  

ప్రసాదములు తయారు చేసే విధానం:- 

!! పొంగల్ !!!! కావలసినవి !!

పెసరపప్పు 150 గ్రాములు 
కొత్త బియ్యం 100 గ్రాములు 
మిరియాలు 15
పచ్చిమిరప కాయలు 6
పచ్చి కొబ్బెర 1 కప్పు 
కాచిన నెయ్యి 1/4 కప్పు 
జీడిపప్పు 15
జీర 1/2 టేబల్ స్పూన్
ఆవాలు 1/4 టేబల్ స్పూన్
ఎండుమిర్చి 3
మినపప్పు , శనగపప్పు 2 టేబల్ స్పూన్స్
కొత్తిమిర , కర్వేపాకు తగినంత
ఉప్పు రుచికి సరిపడ 
ఇంగువ 2 చిటికెళ్ళు.

చేయవలసిన విధానము:-

మదంగా ఉన్న పాత్రలో కాస్త నెయ్యి వేడి చేసి పెసరపప్పుని దోరగా వేయించండి. బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన తరువాత బియ్యం కూడా బాగా వేయించాలి.  తెలుపు రంగు పోకూడదు సుమారు  5 నిమిషాలు వేపితే చాలు పెసరపప్పు కూడ కలర్ మార కూడదు, అదే మూకుడులో మరికాస్త నెయ్యి వేసి జీడిపప్పులను వేయించి పెట్టడి. సన్నగా తరిగిన పచ్చి మిర్చి, పచ్చికొబ్బెరను కోరి, జీలకర్ర మిరియాలు వేయించిన బియ్యం పెసరపప్పు ఇవన్నీ 4 కప్పుల నీళ్ళతో కుక్కర్లో వుంచి మూడు విజిల్స్ వచ్చాక ష్టవ్ కట్టివేయడం చేయండి.

చల్లారాక అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు , జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కర్వేపాక్ వేసి తాలింపుపెట్టి మిగిలిన నెయ్యి అంతా పొంగలిలో వేసి వేడి వేడి ప్రసాదము ఆ తల్లి త్రిపురాసుందరీదేవికి నైవేద్యంపెట్టి భక్తిగా పూజించి ఈ దసరా 10 రోజులు మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ అని ప్రార్ధించాలి.
 

click me!