నయీమ్ కేసు నత్త నడకపై రిపోర్టు కోరిన హైకోర్టు

Published : Oct 18, 2016, 07:37 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
నయీమ్ కేసు నత్త నడకపై రిపోర్టు కోరిన  హైకోర్టు

సారాంశం

నయీం కేసును సిబిఐకి అప్పగించాలన్న పిటిషన్ పై హైకోర్టు విచారణ తెలంగాణా సిట్ విచారణతో లాభం  ఉండదంటున్న సిపిఐ నేత నారాయణ సిట్ విచారణ సాగుతున్నపుడు సిబిఐ దర్యాప్తు  ఆదేశించలేమన్న కోర్టు

గ్యాంగ్‑స్టర్ నయీముంద్దీన్ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని, ఈ విచారణను సిబిఐకి బదలాయించాలని వేసిన పటిషన్ కు  కౌంటర్ దాఖలు చేయాలని హైదరాబాద్ హైకోర్టు  తెలంగాణా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఆదేశించింది. తదుపరి విచారణను మూడువారాల పాటు వాయిదా వేసింది.

 

ఆ మధ్య తెగ సంచలనం సృష్టించిన నయీముద్దీన్  ఎన్ కౌంటర్,ఆయన ఆస్తులు, రాజకీయనాయకులతో పాటు కొంత మంది సీనియర్ పోలీసు అధికారులతో ఆయనకు ఉన్నట్లు చెబుతున్న సంబంధాల మీద లెక్కలేనన్ని కథలు మిడియాలో వచ్చాయి. 

 

దాదాపు నెల రోజుల పాటు  పత్రికలు టివిలు ఈ వివరాలను నిర్విరామంగా ప్రజలకు అందించాయి. నయీంఆస్తులు వేల కోట్లలో ఉన్నాయన్నారు.  పేరు చెప్పకండా,  శాసన సభ్యులలో, ఐపిఎస్ అధికారులలో ఆయన లభ్ధిదారులున్నారని చెప్పారు. నయీమ్ ని క్రూరునిగా, రాక్షసుడిగా, కనివిని ఎరుగునంత కర్కోటకుడిగా చూపించారు. ఆయన కుటుంబసభ్యలెందరినో అరెస్టు చేశారు. అయితే, ఆయనతో సంబంధాలున్నాయని చెబుతున్న బడాబాబుల జోలికి ఎవరూ వెళ్లినట్లు వార్తలు రాలేదు. ఎవరిని అరెస్టు చేయడం గాని, విచారించడం గాని చేయలేదు.

కాకపోతే,  ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటుచేసి విచారించమంది. అంతే,  ఈసిట్ వచ్చాక అంతా ప్రశాంతమయింది.

 

అసలేమీ జరగలేదన్నట్లుగా  నయీమ్  రాద్దాంతం ఒక్క సారిగా  సద్దుమణిగింది.  కారణం ఏమిటి?

 

అందువల్ల  ఈ తతంగం మీద అనుమానొచ్చి,  ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని సీనియర్ సిపిఐ నాయకుడు కె నారాయణ హైదరాబాద్ హైకోర్టులో  పిఐఎల్ (పిల్)  వేశారు. అది ఈ రోజూ న్యాయమూర్తులు రమేష్ రంగనాథన్, శంకర్ నారాయణ్ ల బెంచ్  ముందుకు వచ్చింది. తెలంగాణా  ప్రభుత్వం అజమాయిషిలో ఉన్న సిట్ దర్యాప్తు ఆశాజనకంగా సాగడంలేదని, సాగుతున్నందన్ననమ్మకంకూడా  కలగడంలేదని , అందువల్ల సీబీఐ విచారణకు ఆదేశించాలని  నారాయణ పిటిషన్లో కోరారు. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ,  తెలంగాణ హోంశాఖ, తెలంగాణ డీజీపీ, సీబీఐలను ప్రతివాదులుగా  చేర్చారు.

PREV
click me!