పరీక్షలో ఓ ప్రశ్న చూసి . ఈ చెస్ ఛాంపియన్ ఆనందం చూశారా?

By telugu news teamFirst Published Jun 22, 2023, 12:07 PM IST
Highlights

చెస్ ప్రాడిజీ తన 12వ తరగతి ఇంగ్లీష్ పరీక్షకు హాజరైన తర్వాత ఒక విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తన ఇంగ్లీష్ పేపర్‌లో భాగమైన ఈ ప్రశ్న చూసి, అతను చాలా ఉప్పొంగిపోయాడు.


మీరు గమనించారో లేదో, పదో తరగతి, ఇంటర్ పిల్లలకు  ఇంగ్లీష్ పరీక్షల్లో కొందరు సెలబ్రెటీల గురించి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. క్రీడాకారులకు సంబంధించినవి, లేదంటే సినిమా సెలబ్రెటీలకు సంబంధించిన  గురించో, సినిమా షన్నివేశం గురించో ఇలా ఏదో ఒక ప్రశ్న ఎదురౌతూ ఉంటుంది. అయితే, తాజాగా  తమ ఇంగ్లీష్ పరీక్షా పత్రంలో వచ్చిన ప్రశ్న చూసి ఛాంపియన్ ప్రజ్ఞానంద సంతోషం వ్యక్తం చేశాడు. 

ప్రజ్ఞానందకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతను 10 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ మాస్టర్ టైటిల్‌ను సంపాదించిన దేశంలోని అత్యంత పిన్న వయస్కుడైన చెస్ గ్రాండ్‌మాస్టర్‌లలో ఒకడు. చెస్ ప్రాడిజీ తన 12వ తరగతి ఇంగ్లీష్ పరీక్షకు హాజరైన తర్వాత ఒక విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తన ఇంగ్లీష్ పేపర్‌లో భాగమైన ఈ ప్రశ్న చూసి, అతను చాలా ఉప్పొంగిపోయాడు.

44వ చెస్ ఒలింపియాడ్ గురించిన ప్రశ్న ఉన్న పేపర్ ఫోటోను  ప్రజ్ఞానంద ట్విట్టర్ లో షేర్ చేశాడు.  గతేడాది భారత్‌లో ఒలింపియాడ్‌ జరిగింది. ఒలింపియాడ్ విజేతలలో అతను కూడా ఒకరు కావడం విశేషం. దీంతో, తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నాడు. 

Gave my 12th exams, English paper today.. and was happy to see this question appear!😁 pic.twitter.com/gdVxlvuCpQ

— Praggnanandhaa (@rpragchess)


‘చెన్నైలోని మామల్లపురంలో జరుగుతున్న 44వ చెస్ ఒలింపియాడ్‌ను విదేశాల్లో చదువుతున్న స్నేహితుడికి రాసిన లేఖలో ఎలా నిర్వహించారో  వివరించండి’ అంటూ ప్రశ్న ఇవ్వడం విశేషం. దానిని షేర్ చేసి..“ఈ రోజు నా 12వ తరగతి పరీక్షలకు వచ్చాను. అందులో ఇంగ్లీషు పేపర్ లో ఈ ప్రశ్న కనిపించినందుకు సంతోషంగా ఉంది!” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా, ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు ప్రజ్ఞానంద పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
 

click me!