ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ లోకి కోల్ కతా టీమ్ ఎంట్రీ ఇచ్చింది. లెజెండరీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ ఈ టీమ్ ను కొనుగోలు చేసారు.
Indian Racing Festival 2024 : టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. క్రికెటర్ గానే కాదు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడిగాను పనిచేసిన గంగూలి ప్రస్తుతం రేసింగ్ లో అడుగుపెట్టారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ లో కోల్ కతా ఎంట్రీ ఇచ్చింది... ఈ టీమ్ ను సౌరబ్ గంగూలీ కొనుగోలుచేసారు.ఇలా 'కోల్ కతా రాయల్ టైగర్ రేసింగ్ టీమ్' యజమానిగా మారిపోయారు గంగూలీ.
ఇండియా రేసింగ్ ఫెస్టివల్ అనేది ఇండియాలో నిర్వహిస్తున్న మోటో స్పోర్ట్ ఈవెంట్. ఇప్పటికే రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకుని మూడో సీజన్ కు సిద్దమయ్యింది. గంగూలీ టీం ఎంట్రీతో ఈ రేసింగ్ ఫెస్టివల్ మరింత ప్రత్యేకంగా మారింది.
undefined
ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ ను రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. భారతదేశంలో పెరుగుతున్న మోటార్‌స్పోర్ట్ అభిమానులను ఆకర్షించడానికి రూపొందించిందే రేసింగ్ ఫెస్టివల్. ఇది ప్రధానంగా రెండు విభాగాల్లో జరుగుతుంది... ఒకటి ఇండియన్ రేసింగ్ లీగ్ (IRL) కాగా మరొకటి ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్ (F4IC).
ఈ రేసింగ్ ఫెస్టివల్ నాలుగు నెలలపాటు కొనసాగనుంది... అంటే ఆగస్ట్ లో ప్రారంభమే నవంబర్ లో ముగుస్తుంది. ఇందులో మొత్తం ఎనిమిది నగరాలకు చెందిన టీమ్స్ పోటీపడతాయి... ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, డిల్లీ, గోవా, కొచ్చి, అహ్మదాబాద్ జట్లు వుండగా తాజాగా కోల్ కతా చేరింది. ఈ సీజన్ మోటో స్పోర్ట్స్ అభిమానులకు మరింత జోష్ ఇవ్వనుందని నిర్వహకులు చెబుతున్నారు.
కొల్ కతా రాకుమారుడు, దాదాగా ప్రసిద్దిచెందిన సౌరబ్ గంగూలీ ఇండియన్ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడాయన రేసింగ్ ఫెస్టివల్ లో భాగస్వామ్యం అయ్యారు... కోల్ కతా రాయల్స్ టైగర్ టీం యజమానిగా మారారు. ఈయన రాకతో పశ్చిమ బెంగాల్ తో పాటు తూర్పు ఇండియాలో మోటార్ రేసింగ్ లో నూతన ఉత్సాహం నిండింది. గంగూలీ నాయకత్వంలో కోల్ కతా రాయల్ టైగర్స్ అద్భుతాలు చేస్తుందని అభిమానులు భారీ అంచనాలతో వున్నారు.
"సౌరవ్ గంగూలీని కోల్‌కతా ఫ్రాంచైజీ యజమానిగా ప్రకటించడం మాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. అతడి నాయకత్వం, కమిట్ మెంట్ భారత క్రికెట్ లో సమూల మార్పులు తీసుకువచ్చింది. ఇదే ఇప్పుడు రేసింగ్ ఫెస్టివల్ లోనూ జరుగుతుందని నమ్ముతున్నాం. గంగూలీ ప్రభావంతో కొత్త తరం మోటార్ స్పోర్ట్ వైపు ఉత్సాహంగా నడుస్తుంది. ఆయన ఎంట్రీతో ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ ఆడియన్స్ కూడా పెరిగే అవకాశాలున్నాయి'' అని ఆర్పిపిఎల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి తెలిపారు.
ఇక సౌరబ్ గంగూలీ కూడా ఈ రేసింగ్ ఫెస్టివల్ లో భాగస్వామ్యం కావడంపై మాట్లాడారు. ఈ రేసింగ్ ఫెస్టివల్‌లో కోల్‌కతా జట్టుతో ప్రయాణాన్ని ప్రారంభించడం నిజంగా సంతోషాన్నించిందని అన్నారు. తనకు మోటార్‌స్పోర్ట్స్ పై ఎప్పటినుండో ఆసక్తి వుంది...కోల్‌కతా రాయల్ టైగర్స్ టీమ్ తో తనకు అవకాశం వచ్చిందన్నారు. దేశంలో మోటార్ స్పోర్ట్స్ వృద్దికి తనవంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. కోల్ కతా టీం రేసింగ్ ఫెస్టివల్ లో అద్భుతాలు సృష్టిస్తుందని... తద్వారా కొత్త తరానికి ఈ స్పోర్ట్స్ పట్ల ఆసక్తిని రేకెత్తిస్తుందని అన్నారు. కోల్‌కతా రాయల్ టైగర్స్‌ను ఒక శక్తివంతమైన శక్తిగా మార్చనున్నట్లు గంగూలీ తెలిపారు.