లాంగ్ జంప్‌లో అనేక పతకాలు సాధించిన అంజూ బాబీ జార్జి...
పెయిన్ కిల్లర్ తీసుకున్నా, అది నాకు పడేది కాదు...
ఒకే కిడ్నీతో అంతర్జాతీయ వేదికలపై రాణిస్తున్నా...
దానికి కారణం కోచ్ మాయజాలం... అతనిలో దాగి ఉన్న నైపుణ్యం కారణం కావచ్చు...
భారతదేశంలో క్రికెటర్లకి, బ్యాడ్మింటన్, టెన్నిస్ ప్లేయర్లకి వచ్చేంత క్రేజ్ అథ్లెట్లకి రాదు. అయితే అంతర్జాతీయ వేదికలపై జాతీయ పతాకం రెపరెపలాడించాలని తహతహలాడుతున్నారు భారత అథ్లెట్లు. అలా ఎన్నోసార్లు దేశం గర్వించే ప్రదర్శన ఇచ్చిన భారత మహిళా అథ్లెట్ అంజూ సంచలన విషయాన్ని బయటపెట్టింది.
లాంగ్ జంప్‌లో అనేక పతకాలు సాధించిన అంజూ బాబీ జార్జి... సుదీర్ఘ కాలంలో ఒకే కిడ్నీతో ప్రదర్శన ఇస్తున్నట్టు షాకింగ్ ట్వీట్ ఇచ్చింది. ‘ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఒకే కిడ్నీతో అంతర్జాతీయ వేదికలపై రాణిస్తున్నా... ఒకే కిడ్నీతో ప్రపంచంలో అత్యుత్తమ స్థానాన్ని అందుకున్న అథ్లెట్లలో నేను ఒకదాన్ని. ఇది నా అదృష్టం కావచ్చు. పెయిన్ కిల్లర్ తీసుకున్నా, అది నాకు పడేది కాదు.
undefined
పెయిన్ కిల్లర్ వాడితే నా కాలు వేగంగా స్పందించేది కాదు. ఇలా ఎన్నో కష్టాలు దాటి విజయాలు అందుకున్నా... దానికి కారణం కోచ్ మాయజాలం... అతనిలో దాగి ఉన్న నైపుణ్యం కారణం కావచ్చు’... అంటూ క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు, అథ్లెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలను ట్యాగ్ చేసింది.
దీనికి స్పందించిన కిరణ్ రిజుజు... ‘అంజు... ఇది నీ హార్డ్ వర్క్. అంకిత భావం వల్లే సాధ్యమైంది. టెక్నికల్ సపోర్టుతో పాటు మంచి నైపుణ్యం ఉన్న కోచ్‌లు నీకు సహకారం అందించారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్ గెలిచిన ఒకే ఒక్క భారతీయురాలిగా ఉన్న నిన్ను చూసి గర్విస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. ఆసియా క్రీడల్లో ఓ స్వర్ణం, ఓ రజతం, కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం, ప్రపంచ అథ్లెట్స్‌లో రజతం సాధించింది అంజూ బాబీ.