ఆసియా బాక్సింగ్ చాపింయన్‌షిప్: కాంస్యంతో సరిపెట్టుకున్న తెలంగాణ మహిళా బాక్సర్

By Arun Kumar PFirst Published Apr 26, 2019, 2:53 PM IST
Highlights

ఆసియా దేశాల మద్య జరుగుతున్న బాక్సింగ్ చాంపియన్‌షిప్ లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. లీగ్ దశ, క్వాటర్, సెమీ ఫైనల్ పోరులో ప్రత్యర్థులను తమ పదునైన పంచులతో మట్టికరిపించి ఫైనల్ కు అర్హత సాధించారు. ఇలా ఆరుగురు సీనియర్ బాక్సర్లు పసిడి పతకాలకు మరో అడుగు దూరంలో నిలిచారు. 

థాయ్‌లాండ్ వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలో భారత్ నుండి చాలామంది సీనియర్లు పాల్గొన్నారు. ఇలా పురుషులు, మహిళ రెండు విభాగాల్లోని బాక్సర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. పురుషుల్లో 75 కేజీల విభాగంలో ఆశిష్ కుమార్,  56 కేజీల విభాగంలో కవిందర్‌ సింగ్‌ బిష్త్‌, 52 కేజీల విభాగంలో అమిత్‌ పంఘల్‌, 49 కేజీల విభాగంలో దీపక్‌ సింగ్ లు ఫైనల్ కు అర్హత సాధించారు. ఇక మహిళా భాక్సర్లలో 81 కేజీల విభాగంలో పూజా రాణి, 64 కేజీల విభాగంలో సిమ్రన్‌జిత్‌ కౌర్‌ ఫైనల్లో తలపడనున్నారు. 

తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ నిరాశపర్చింది. 51 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఆమె సెమీఫైనల్ నుండే వెనుదిరిగింది. ఆమెతో పాటు సరితా దేవి (60 కేజీలు), సోనియా చహల్‌ (57 కేజీలు), మనీషా మౌన్‌ (54 కేజీలు)... పురుషుల విభాగంలో శివ థాపా (60 కేజీలు), ఆశిష్‌ (69 కేజీలు), సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు) సెమీఫైనల్లోనే ఓటమిపాలై కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. 

click me!