భూమా అఖిలప్రియ పక్కా కిడ్నాప్ ప్లాన్: వెనక కథ ఇదీ....

By telugu teamFirst Published Jan 7, 2021, 7:54 AM IST
Highlights

ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో టీడీపీ నేత భూామా అఖిలప్రియ అరెస్టయిన విషయం తెలిసిందే. దాని వెనక హైదరాబాదులోని విలువైన భూమి వివాదమే కారణంగా చెబుతున్నారు.

హైదరాబాద్: భూవివాదమే మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ అరెస్టుకు భూవివాదమే కారణమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి  సమీప బంధువులు ప్రవీణ్ కుమార్, ఆమె సోదరుల కిడ్నాప్ కేసులో అఖిలప్రియను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

హఫీజ్ పేటలో  48 ఎకరాల భూములను చాలా ఏళ్ల క్రితం భూమా నాగిరెడ్డి కొన్నారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అదే సర్వే నెంబరులో ఐదేళ్ల క్రితం ప్రవీణ్ రావు 25 ఎకరాల భూమి కొనుగోలు చేశారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో వివాదం తలెత్తింది. 

ఆ స్థితిలో వివాదం పరిష్కారం కోసం ప్రవీణ్ రావు వర్గానికి చెందినవారు ఏవీ సుబ్బారెడ్డిని సంప్రదించారు. ఈలోగా భూమా నాగిరెడ్డి మరణించారు. నిరుడు సెప్టెంబర్ లో ఏవీ సుబ్బారెడ్డి ఆ భూముల స్వాధీనానికి ప్రయత్నించినట్లు సమాచారం. దాంతో ప్రవీణ్ రావు హైదరాబాదులోని మియాపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏవీ సుబ్బారెడ్డిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత ఆ భూములను స్వాధీనం చేసుకోవడానికి ఆయన కూతుళ్లు భూమా అఖిలప్రియ, మౌనిక ప్రయత్నాలు చేశారు. ప్రవీణ్ రావు, ఆయన సోదరులు తమ మాట వినడం లేదనే కోపంతో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ వారి అపహరణకు పథకం వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 

కర్నూలు, గుంటూరు జిల్లాల్లోకు చెందిన కిడ్నాపర్ల ముఠాను అఖిలప్రియ, భార్గవరామ్ సంప్రదించారు. వారం రోజుల క్రితం 15 మందిని హైదరాబాదు పిలిపించారు. హైదరాబాదు శివారులోని భార్గవరామ్ మిత్రుడి పాఠశాలలలో వారిని ఉంచి ఆదాయం పన్ను అధికారుల్లా నటించడానికి శిక్షణ ఇప్పించారు. 

ప్రవీణ్, నవీన్, సునీల్ రావు ఉంటున్న ఇంటి వద్ద ఐదు రోజుల క్రితం రెక్కీ నిర్వహించి మంగళవారం రాత్రి రంగంలోకి దిగారు. వారిని కిడ్నాప్ చేశారు. 

click me!