అజిత్ పవార్ ఘర్ వాపసీ కి అసలు కారణం ఇదే ...

By telugu team  |  First Published Nov 26, 2019, 6:04 PM IST

మహారాష్ట్రలో అసలు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి కారణమే అజిత్ పవార్. అజిత్ పవార్ మద్దతుతెలపగానే, అజిత్ వెంట కనీసం ఒక 30 మంది ఎమ్మెల్యేలన్నా వస్తారనుకున్నారు. కాకపోతే రాజకీయ దురంధరుడు శరద్ పవార్ చాణక్య వ్యూహం ముందు అజిత్ తలొగ్గక తప్పలేదు. 


మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేసారు. రాజీనామాను ప్రకటిస్తూ నిర్వహించిన ప్రెస్ మీట్లో ఫడ్నవీస్ మాట్లాడుతూ, అజిత్ పవార్ రాజీనామా చేయడంతో తమ వద్ద సంఖ్యాబలం లేకుండా పోయిందని, అందుకే రాజీనామా చేస్తున్నట్టు ఫడ్నవీస్ ప్రకటించారు. 

మహారాష్ట్రలో అసలు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి కారణమే అజిత్ పవార్. అజిత్ పవార్ మద్దతుతెలపగానే, అజిత్ వెంట కనీసం ఒక 30 మంది ఎమ్మెల్యేలన్నా వస్తారనుకున్నారు. కాకపోతే రాజకీయ దురంధరుడు శరద్ పవార్ చాణక్య వ్యూహం ముందు అజిత్ తలొగ్గక తప్పలేదు. 

Latest Videos

undefined

Also read: రేపే మహారాష్ట్రలో బలపరీక్ష: అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి గవర్నర్ ఆదేశం

ఒక్క అజిత్ పవార్ మినహా ఆయనవెంట ఒక్క ఎమ్మెల్యేను కూడా లేకుండా చేయగలిగాడు శరద్ పవార్. శరద్ పవార్ ఈ చర్యతో ఒకింత షాక్ కు అజిత్ పవార్ గురైనా కూడా ఆయన వెనక్కి తగ్గుతున్నట్టు ఎక్కడా కనపడలేదు. తన ట్విట్టర్ బయోలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అఫ్ మహారాష్ట్రగా మార్చుకున్నారు. ఆ తరువాత వరుస ట్వీట్లలో తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర బీజేపీ నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఉన్నట్టుండి అజిత్ పవార్ ఎందుకు రాజీనామా చేసాడు నేదానికి మాత్రం ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వారు రాసేసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల వత్తిడి ఒక కారణం అయి ఉండవచ్చు. కానీ అదే ప్రధాన కారణం మాత్రం కాదు. 

అజిత్ పవార్ ఉన్నట్టుండి ఇలా తన నిర్ణయం మార్చుకోవడానికి కారణం నేటి సుప్రీమ్ కోర్టు జడ్జిమెంట్. సుప్రీంకోర్టు తన తీర్పులో క్లియర్ గా ప్రొటెం స్పీకర్ ముందు కేవలం ఒకటే అజెండాను మాత్రమే ఉంచింది. కేవలం సభ్యులతో ప్రమాణస్వీకారం  చేపించడం, ఆ తరువాత బల పరీక్ష నిర్వహించడం మాత్రమే ప్రొటెం స్పీకర్ చేయాల్సిన పని అని సుప్రీమ్ కోర్ట్ చెప్పింది. 

ఒక వేళ గనుక సుప్రీమ్ కోర్ట్ ఇలా చెప్పకుండా ఉంది ఉంటే, అజిత్ పవార్ విప్ జారీచేసి ఉండేవాడు. విప్ గనుక జారీ చేసి ఉంటే ఖచ్చితంగా ఎన్సీపీ సభ్యులంతా విప్ ను ధిక్కరించడానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ ఆ చివరి అవకాశం కూడా లేకపోవడంతో చేసేదేమి లేక అజిత్ పవార్ రాజీనామా చేసాడు. 

Also read: కర్ణాటక గౌడలకు మహారాష్ట్ర పవార్ లకు చాలా దగ్గరి పోలిక

ఒకవేళ చేయకుండా ఉండి ఉంటే, రేపు బల పరీక్షలో బీజేపీ ఓడిపోయేది. బలపరీక్ష లో ఓడితే బీజేపీకి వచ్చిన నష్టం ఏమీలేదు, కాకపోతే అజిత్ పవార్ మాత్రమే ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతాడు. 

దానితోపాటు కుటుంబసభ్యులంతా కూడా అజిత్ పవార్ ను వెనక్కి తీసుకురావడానికి విశ్వా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సుప్రియ సులే స్టేటస్ లు చూసినా, రోహిత్ పవార్ ఎమోషనల్ గా పెట్టిన పేస్ బుక్ పోస్ట్ ను చూసినా, పవార్ కుటుంబమంతా ఎంతలా ట్రై చేసిందో మనకు అర్థమవుతుంది. 

అన్నిటికంటే ముఖ్యంగా, శరద్ పవార్ అజిత్ పవార్ ని ఇంతవరకు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. కుటుంబంలో బీటలు పడటం ఇష్టంలేని శరద్ పవార్, ఇతర పవార్ కుటుంబ సభ్యులు అతడితో వరుసగా మాట్లాడుతున్నారు. తనకు ఎలాగూ ఆస్కారం లేదు అని తెలిసిన తరువాత కనీసం కుటుంబంలోకన్నా ఎంట్రీ దొరికితే చాలు అనే పరిస్థితికి అజిత్ పవార్ఫ్ వచ్చారు. 

ఒక్క విషయం మాత్రం పక్కా గా చెప్పవచ్చు. పవర్ ఫాలోస్ పవార్ అనే నానుడిని మరోసారి నిజం చేస్తూ, తానేంటో, తనను భారత రాజకీయ దురంధరుడు అని ఎందుకంటారో మరోమారు రుజువు చేసారు. 

click me!