రాఫెల్ డీల్: మోడీ సర్కార్ నిజాయితీకి సుప్రీం ఆమోద ముద్ర

By pratap reddy  |  First Published Dec 15, 2018, 10:23 AM IST

మొదటి నుంచీ,  ఆగస్టావెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ కొనుగోలు వాస్తవ కుంభకోణం నుంచి దృష్టి మళ్లించడానికి రాఫెల్ గొడవ చేశారనేది స్పష్టం. రాహుల్ వాడుకున్న సమాచారం కొంత మంది డాసౌల్ట్ పోటీదారుల ప్రోద్బలంతోనే అనేది కూడా స్పష్టం. 


రాజీవ్ చంద్రశేఖర్, పార్లమెంటు సభ్యులు

రాఫెల్ ఫైటర్ డీల్ పై కాంగ్రెసు, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు సుప్రీంకోర్టు అంతం పలికింది. "ప్రక్రియపై మాకు సందేహం లేదు. ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాణాలపై సందేహం లేదు. సంసిద్ధం కాకుండా మన దేశాన్ని అపకూడదు" అని తన తీర్పులో చెప్పింది.  

Latest Videos

undefined

తీవ్రమైన ఆరోపణలు చేయడాన్ని ఆ నాయకుడు (నేను ఈ పదాన్ని చాలా వదులుగా వాడుతున్నాను), ఆ రాజకీయ పార్టీ రాజకీయ వ్యూహంగా ఎంచుకుంది. అటువంటి నాయకుడికి లేదా పార్టీకి తీర్పులోని ఆ మూడు వాక్యాలు తప్పుడు మార్గం పట్టిన నాయకుడికి/ పార్టీకి తప్పని పాఠం కావాలి. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవినీతి నుంచి కార్పోరేట్ సంస్థలకు ఎన్ పిఎ రద్దు వరకు - రాహుల్ అబద్ధాలు, ఆరోపణల షూట్ అండ్ స్కూట్ వ్యూహాన్ని పిటిషన్ తోసివేత నగ్నంగా నిలబెట్టింది.

ఆ వ్యూహంతో ప్రభుత్వం, ప్రత్యేకంగా రక్షణ మంత్రిత్వ శాఖ వెనుకంజ వేసింది. కాంగ్రెసు చేసిన ప్రచారం హోరుకు, చెప్పిన అబద్ధాలకు ప్రాథమిక స్పందనలు ఆ స్థాయిలో కనిపించలేదు. దేశ భద్రతకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పటికీ రాహుల్ చేసిన ప్రచారం ప్రత్యేకంగా క్షమార్హం కాదు. దాంతో ఎయిర్ చీఫ్, ఇద్దరు ఎయిర్ మార్షల్స్ కోర్టు లోపల, బయట వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.  

మొదటి నుంచీ,  ఆగస్టావెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ కొనుగోలు వాస్తవ కుంభకోణం నుంచి దృష్టి మళ్లించడానికి రాఫెల్ గొడవ చేశారనేది స్పష్టం. రాహుల్ వాడుకున్న సమాచారం కొంత మంది డాసౌల్ట్ పోటీదారుల ప్రోద్బలంతోనే అనేది కూడా స్పష్టం. 

కానీ, రాహుల్ గాంధీ, కాంగ్రెసు సందర్భంలో నేను మళ్లీ చెప్పడానికి ఇష్టపడుతున్నాను - సత్యం తప్పకుండా వెలుగు చూస్తుంది. నేడు అదే జరిగింది.

ఐఎఎఫ్ నాయకత్వం డాసౌల్ట్ రాఫెల్ అత్యంత సమర్థవంతమైనవి. చైనా, పాకిస్తాన్ లకు చెందినవాటి కన్నా సాంకేతికంగా అత్యంత సమర్థవంతమైనవి. అతి తక్కువ కోట్ చేసిన రాఫెల్ బిడ్డర్ ను యుపిఎ ప్రభుత్వ హయాంలోనే ఎంపిక చేశారు. కానీ యుపిఎ ప్రభుత్వం డీల్ పై సంతకం చేయలేదు. దానికి కారణం ఏమిటనేది ఇప్పటికీ తెలియదు. 

నిర్ణయం తీసుకోవడం ఏళ్ల తరబడి ఆలస్యం కావడం, 3 దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన షూ-30ఎంకెఐ ఆపరేషనల్ సామర్థ్యాలు దెబ్బ తినడం వల్ల ఎయిర్ ఫోర్స్ చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వెండర్ నుంచి ఎగరడానికి తగిన సామర్థ్యం లేనివాటిని కొనుగోలు చేయడం వల్ల ఐఎఎఫ్  కు సంపత్తి కొరతతో బాధపడింది. యుపిఎ దశాబ్దాల తరబడి యుపిఎ ప్రభుత్వం కావాలని, ప్రమాదకరంగా తన నిర్ణయాలను పక్కన పెట్టడం వల్ల తక్షణావసరం ఏర్పడింది. ఐఎఎఫ్ పాత ఎయిర్ క్రాఫ్ట్ లను నడుపుతున్న సమయంలో, యువ పైలట్లు వాటిని నడిపే విషయంలో అంతులేని చిక్కులు ఎదుర్కుంటున్న సమయంలో, చైనా దూకుడుగా ఉన్న స్థితిలో సైన్యంలో పనికి రాని ఎయిర్ క్రాఫ్ట్ లతో నిండిన సమయంలో -  యుపిఎ ప్రభుత్వం అత్యధునాతన న్యూక్లియర్ డెలివరీ సామర్థ్యం గల ఫైటర్ ప్లాట్ ఫారంపై నిర్ణయం తీసుకోవడానికి బదులు కాంగ్రెసు ప్రథమ కుటుంబం కోసం అగస్టావెస్ట్ ల్యాండ్ విఐపి హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి విలువైన ఎయిర్ ఫోర్స్ వనరులను వాడింది. 

అత్యంత వేగంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని నరేంద్ర మోడీ గుర్తించారు. సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో కొత్త ఎయిర్ క్రాఫ్ట్ లు అందుబాటులోకి తేవడానికి వేగంగా ముందుకు కదలాల్సి వచ్చింది. తగిన చర్చలు అప్పటికే పూర్తి అయినందున 2016లో ఇరు దేశాల మధ్య కాంట్రాక్టుపై సంతకాలు జరిగాయి.. 

మధ్యకాలిక, దీర్షకాలిక అవసరాల కోసం, ప్రబుత్వం ప్రభుత్వం మేక్ ఇండియా ప్రోగ్రాం కు రోడ్ మ్యాప్ వేసింది. అందులో భాగంగా వెండర్ నుంచి టెండర్ ద్వారా మిగతా 100 పైచిలుకు ఫైటర్స్  కోసం ప్రభుత్వ/ప్రైవేట్ కంపెనీని ఎంపిక చేయడం జరుగుతుంది. స్వల్ప వ్యవధిలో ఐఎఎఫ్ ను బలోపేతం చేయడానికి, దీర్షకాలంలో సైనిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి దేశానికి అదే సరైన వ్యూహం.

రాజకీయ బురదకు మూల్యం  

కాంగ్రెసు కుంభకోణాల చరిత్ర చాలా పెద్దది. అప్పటి రక్షణ మంత్రి పాత్ర ఉన్న 70ల్లో జరిగిన జాగ్వార్ డీల్ లో విఐపి హెలికాప్టర్ల కుంభకోణంలో వెలుగు చూసిన వ్యవహారంలో ఉన్నట్లు ఇటీవలి కథనాలు తెలియజేశాయి. తన సుదీర్ఘ సందేహాస్పద చరిత్రను ప్రజలు మరిచిపోయి, ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలను నమ్ముతారని కాంగ్రెసు అనుకుని ఉంటుందనేది స్పష్టం. కానీ విషాదకరమైన రాజకీయ వ్యూహం విఫలమైంది.  సూప్రింకోర్టు నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేసింది. అదే సమయంలో ఢిల్లీ కారిడార్లలో దశాబ్దాలుగా పేరుకుపోయిన ప్రయోజనాలను కడిగేయడానికి మోడీ ప్రభుత్వ స్థిరసంకల్పానికి బలం చేకూర్చింది. 

అబద్ధాలు చెప్పడం, దుష్ప్రచారం చేయడం రాహుల్, ఆయన సలహాదారులకు న్యాయబద్దమైన రాకీయ వ్యూహాలుగానే కనిపించచ్చు. కానీ దేశభద్రత ఆధునీకకరణపై, సైనిక దుస్తుల్లో సేవలు అందించేవారి మనస్సులపై వేసిన నేరపూరిత ప్రభావం క్షమార్హం కాదు. కొన్ని విషయాలు మనందరికీ ఆగ్రహం తెప్పించేంత దుర్మార్గంగా ఉంటాయి. ఉదాహరణకు, ఐఎఎఫ్ తప్ప ప్రపంచంలో ఏ ఎయిర్ ఫోర్స్ కూడా జాగ్వార్ లను వాడడం లేదు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ వాటిని అప్ గ్రేడ్ చేసుకుని, మరో పాతికేళ్ల పాటు సమర్థంగా అది ఉపయోగపడాలని చూస్తోంది. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ కొత్త చేర్పులు లేక ఐఎఎఫ్ పాత ఎయిర్ క్రాఫ్ట్ లనే వాడాల్సిన అనివార్యతలో పడింది. రాజకీయ నాయకులు పోట్లాడుకుంటూ, అధికారులు ఫైళ్లపై కూర్చుంటే పుణ్య కాలం కాస్తా దాటిపోతుంది. 90ల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, తూర్పు ఐరోపా దేశాల నుంచి 20-30 గ్రౌండెడ్ ఎంఐజీ-21లను కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ సెకండ్ హ్యాండ్ కొనుగోళ్లతో ఐఎఎఫ్ పనిచేయాల్సి వచ్చింది. 

రెండు దశాబ్దాల తర్వాత నేటికి కూడా కాంగ్్రెసు ఏ విధమైన మార్పు రాలేదు, చిల్లర రాజకీయాల ప్రయోజనం పొందాలనుకోవడం, సాయుధ బలగాల సైనిక సంసిద్ధతను వెనక్కి నెట్టడం.

రాజకీయ నాయకులు ప్రచారం చేసే ప్రమాదకరమైన అబద్ధాలకు, అసత్యాలకు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సే ఉంటుందని నేను నమ్ముతాను. ఈ విధమైన రాజకీయాల ద్వారా దేశం, దాని భద్రక, రక్షణ బలగాల పటిష్టతలతో ఆడుకోవడాన్ని అనుమతించదు, అనుమతించకూడదు కూడా.

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు తీర్పు కొత్త సవాళ్లను విసురుతోంది. అబద్ధాలతో, తప్పుడు ప్రచారంతో దృష్టిని తన వైపు తిప్పుకునే రాజకీయ వ్యూహం కోసం శక్తులను కేంద్రీకరించిన నాయకుడు రాహుల్ తర్వాత చెప్పే రాజకీయపరమైన అసత్యాలను అర్థం చేసుకోవడానికి అవసరమైన తెలివితేటలను తీర్పు ప్రసాదిస్తుంది. లీయో టాల్ స్టాయ్ ను ఉటంకించే కొత్త ఫ్యాన్సీకి రాహుల్ గాంధీ తన ట్వీట్స్ ద్వారా తెర తీశారు. అందులో లీయో టాల్ స్టాయ్ "అబద్ధాలు, వంచన కన్నా మరేదైనా మంచిదే"  అన్న మాటలు ఆయనకు సరిపోతాయి. 

మన సాయుధ బలగాలను ఆధునీకరించే కఠినమైన కార్యాన్ని నరేంద్ర మోడీ చేపట్టారు. డిఫెన్స్ డీల్స్ ప్రపంచంలోని క్లిష్టమైన సమస్యలను అధిగమించడానికి సమగ్రత, నిబద్ధతలతో పనిచేసే తన ప్రభుత్వ సమర్థతపై విశ్వాసంతో కొనుగోళ్లలోని స్తంభనను బద్దలు కొట్టడానికి ఆయన రాజకీయ కఠిన నిర్ణయాలు తోడ్పడ్డాయి. దేశ భద్రత లక్ష్యసాధనలో నిమగ్నమైన స్త్రీపురుషులు అత్యుత్తమంగా చేయగలమనే విశ్వాసం ఆయనపై ఉంచారు. సాఫ్ నియత్ తో సాహి వీకాస్ ఆయన ప్రభుత్వం కట్టుబడి ఉిందనే విషయం మరోసారి నేడు రుజువైంది.    

click me!