అమెరికాలో మిన్నంటుతున్న నిరసనలు, అసలు కారణాలు ఏమిటి...?

By Sree SFirst Published Jun 1, 2020, 5:23 PM IST
Highlights

అమెరికాలో గత ఆరు రోజులుగా నిరసనలు మిన్నంటుతున్నాయి. చాలాచోట్ల అవి పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలకు కూడా దారి తీస్తున్నాయి. తాజాగా ఈ నిరసనల సెగ అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌజ్ ని కూడా తాకాయి. ఈ అన్ని నిరసన మధ్యలో సందులో సడేమియా అన్నట్టుగా కొందరు రోడ్లపైన ఉన్న దుకాణాలను లూటీ చేస్తున్నారు. 

అమెరికాలో గత ఆరు రోజులుగా నిరసనలు మిన్నంటుతున్నాయి. చాలాచోట్ల అవి పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలకు కూడా దారి తీస్తున్నాయి. తాజాగా ఈ నిరసనల సెగ అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌజ్ ని కూడా తాకాయి. ఈ అన్ని నిరసన మధ్యలో సందులో సడేమియా అన్నట్టుగా కొందరు రోడ్లపైన ఉన్న దుకాణాలను లూటీ చేస్తున్నారు. 

ఈ అన్ని నిరసనలకు ఆందోళనలకు కారణం జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడి మరణం. నిరాయుధుడైన అతడిని పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో అతడి గొంతుపై బలంగా మోకాలితో నొక్కడంతో అతడు మరణించాడు. 

అతడిపై డెరెక్ చౌవిన్ అనే పోలీస్ ఆఫీసర్ మోకాలు బలంగా పెట్టినప్పుడు జార్జ్ ఫ్లాయిడ్ తనకు ఊపిరి అందడం లేదని, తన మెడపైన మోకాలుతీయాలని పలుమార్లు కోరాడు. ఇదంతా అక్కడ చుట్టూ గుమికూడినవారు తమ కెమెరాల్లో రికార్డు చేసారు కూడా.  

అక్కడ ఉన్న ప్రజలు కూడా పోలీస్ ఆఫీసర్ ని కాలు తీయమని కోరినప్పటికీ... అతడు పట్టించుకోలేదు. దాదాపు ఎనిమిది నిముషాలు పోలీస్ ఆఫీసర్ మోకాలితో ఒత్తగా, అతడు స్పృహ కోల్పోయిన తరువాత రెండునారా నిమిషాలపాటు ఆ కాలిని అలానే ఉంచాడు. 

అయితే పోలీసులు మాత్రం ఇలా అక్కడ చుట్టుపక్కలవారు వీడియో షూట్ చేసే కన్నా ముందు అతడు పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడని, చెప్పినమాట వినలేదని, మాధకద్రవ్యాల మత్తులో ఉన్నాడని పోలీసులు అన్నారు. 

కానీ, అక్కడి రెస్టారంట్ కెమెరాలో మాత్రం లా ఫ్లాయిడ్ వారితో దురుసుగా ప్రవర్థించినట్టు ఎకాడ కూడా రికార్డు అవలేదు. ఇక పోలీసులను ప్లాయిడ్ నన్ను చంపకండి ప్లీజ్ అని వేడుకుంగుతున్న వీడియో బాగా వైరల్ గా మారింది. 

ఇంతకు ఫ్లాయిడ్ ని అరెస్ట్ చేయడానికి పోలీసు వారు రావడానికి కారణం ఒక 20 డాలర్ల నోటు. ఆ నోటు నకిలీది అని సదరు రెస్టారంట్ ఓనర్ పోలీసులకు సమాచారం అందించింది. ఈ చిన్న నేరానికి అందునా, అతడు నేలపై పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉన్నప్పటికీ... ఇలా గొంతుపై మోకాలితో తొక్కావలిసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. 

ఎప్పుడైతే వీడియో వైరల్ గా మారిందో ఈ ఘటన జరిగిన బస్సు స్టాప్ వద్దకు ప్రజలు స్వచ్చంధంగా వచ్చి బ్లాక్స్ లైఫ్స్ మ్యాటర్ అంటూ అక్కడ పుష్పగుచ్చాలు ఉంచారు. అక్కడ పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. ఒక కిటికీ, మరో వాహనం పగలడంతోనే పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. 

టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో దాడికి దిగారు. వెంటనే ప్రజలు మరోసారి తీవ్రంగా ఫైర్ అయ్యారు. తెల్లజాతీయులు నిరసనలు తెలిపినప్పుడు ఈ స్థాయిలో అణిచివేయని పోలీసులు నల్లజాతీయుల నిరసన అవడంతో ఈ స్థాయిలో విరుచుకుపడ్డారని ఆరోపించారు. 

ఎందరో శ్వేతజాతీయులు కూడా నల్లజాతీయులు మద్దతుగా రోడ్లపైకి వచ్చారు. పోలీసులు కర్కశంగా ప్రవర్తిస్తూ నిరసనకారులపై విరుచుకుపడడంతో ఆ నిరసనలు అంతకంతకు పెరుగుతూ ఏకంగా వైట్ హౌస్ నే చేరాయి. 

అమెరికాలో ఇంకా జాత్యహంకారం పోలేదని సోషల్ మీడియాలో తెగ పోస్టులను పెడుతున్నారు. అమెరికా ప్రభుత్వం ఎం చేయాలో అర్థంకాక అక్కడి ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ ని విధించింది. కర్ఫ్యూని ధిక్కరిస్తూ ఎందరో ప్రజలు రోడ్లపైకి వస్తు నిరసనలు తెలుపుతున్నారు. 

ట్రంప్ ఈ నిరసనల్లో పాల్గొన్నవారిని దేశీయ తీవ్రవాదులు అని అనడంతో ఈ నిరసనలు మరోసారి ఎక్కువయ్యాయి. ఈ నిరసనల దెబ్బకు ట్రంప్ ఏకంగా ఒక గంటపాటు వైట్ హౌస్ బంకర్ లో తలదాచుకోవాలిసి వచ్చింది. 

ట్విట్టర్ ఏకంగా తన సింబల్ ను నల్ల రంగులోకి మార్చి బ్లాక్ లీవెస్ మ్యాటర్ అని తెలిపింది. అమెరికాలోని అన్ని ప్రధాన నగరాలకు కూడా ఈ నిరసనలు వ్యాపించాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ప్రభుత్వం రంగంలోకి ఆర్మీని దింపింది. 

click me!