హిస్టరీ రిపీట్: 1978లో అప్పుడు సీనియర్ పవార్, 2019లో ఇప్పుడు జూనియర్ పవార్

By telugu teamFirst Published Nov 23, 2019, 5:16 PM IST
Highlights

బీజేపీతోని అజిత్ పవార్ జత కట్టడంపై ఎన్సీపీ, కాంగ్రెస్, శివ సేనలు అందరూ కారాలు మిర్యాలు నూరుతున్నారు. ఈ పరిస్థితులు అందరికి ఒకింత విస్మయం కలిపించినా వాస్తవానికి ఇది ఒక హిస్టరీ రిపీట్ గా అనిపిస్తుంది. 1978లో శరద్ పవార్ కాంగ్రెస్ కు ఎం చేశారో ఇప్పుడు అజిత్ పవార్ ఎన్సీపీకి అలంటి షాకే ఇచ్చారనిపిస్తుంది. 

బీజేపీతోని అజిత్ పవార్ జత కట్టడంపై ఎన్సీపీ, కాంగ్రెస్, శివ సేనలు అందరూ కారాలు మిర్యాలు నూరుతున్నారు. ఈ పరిస్థితులు అందరికి ఒకింత విస్మయం కలిపించినా వాస్తవానికి ఇది ఒక హిస్టరీ రిపీట్ గా అనిపిస్తుంది. 1978లో శరద్ పవార్ కాంగ్రెస్ కు ఎం చేశారో ఇప్పుడు అజిత్ పవార్ ఎన్సీపీకి అలంటి షాకే ఇచ్చారనిపిస్తుంది. 

1978 జులైలో శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తన వర్గంతోటి బయటకు వచ్చి, అప్పటి జనతా పార్టీ (ప్రస్తుత బీజేపీ పార్టీ) తో కలిసి పిడిఎఫ్ పేరిట కూటమిని ఏర్పాటు చేసి దానికి శరద్ పవార్ అధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు శరద్ పవార్ అన్న కొడుకు ఇలా బయటకు పోవడంతో, నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్షా అని అనిపిస్తుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే గతంలోనూ, ప్రస్తుత పరిస్థితిలోనూ లాభపడింది బీజేపీయే కావడం విశేషం. 

వసంతదాదా పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాత్రికి రాత్రే శరద్ పవార్ కూల్చేశారు. మరుసటి రోజు ఉదయం 38 సంవత్సరాల వయసులో, మహారాష్ట్రలో అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి గా శరద్ పవార్ అవతరించారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారిగా 580 రోజులు కొనసాగారు. రెండేళ్లలోపే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చి పవార్ ప్రభుత్వాన్ని గద్దె దింపారు.  సంవత్సరాల తరబడి ప్రతిపక్షంలో కూర్చున్న తరువాత, పవార్‌ను 1986 లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తిరిగి కాంగ్రెస్‌లో తిరిగి చేరడానికి అనుమతించారు.

బీజేపీకి మద్దతివ్వాలనే అజిత్ పవార్ నిర్ణయం తో తనకు కానీ, తన పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదని, ఆ నిర్ణయాన్ని ఎన్సీపీ ఏ విధంగానూ సమర్థించబోదని శరద్ పవార్ తన ట్విట్టర్ వేదికగా తెలియచెప్పాడు. మహారాష్ట్ర రాజకీయాల్లో తిరిగిన ఊహించని మలుపుతో, ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో సీఎం పీఠం ఎక్కాలన్న శివసేన ఆశలకు బీజేపీ గండికొట్టినట్టయ్యింది.  

తెరవెనక చక్రం తిప్పిన అమిత్ షా, ఎన్సీపీని తన వైపుకు తిప్పుకోగలిగాడు. కూటమి ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేనే ఉంటారని శుక్రవారం రాత్రే శరద్‌ పవార్‌ ప్రకటించారు. ఈలోపే దేవేంద్ర ఫడ్నవిస్‌ కేంద్ర పెద్దల సూచనలతో ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌తో రహస్య మంతనాలు జరిపినట్టు సమాచారం. బీజేపీకి మద్దతిస్తె, డిప్యూటీ సీఎంతో పాటు ఇతర మంత్రివర్గ బెర్తులను ఇస్తామని చెప్పారట. 

అయితే తొలి నుంచి ఉద్ధవ్‌ ఠాక్రేకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న అజిత్‌ పవార్‌ బీజేపీ నేతలతో చేతులు కలిపినట్లు సమాచారం. అజిత్‌  చర్యతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలు షాక్‌కి గురయ్యారు.అయితే ఈ వ్యవహారమంతా శరద్‌ పవార్‌కు తెలియకుండా అజిత్‌ పవార్‌ జాగ్రత్త పడ్డారని ఎన్సీపీ వర్గాలంటున్నాయి. 

ఈ నేపథ్యంలోనే 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతు ప్రకటించి, ఎన్సీపీలో చీలిక తెచ్చారని వార్తలు గుప్పుమంటున్నాయి. కాగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాల్లో గెలుపొందిన  విషయం తెలిసిందే. 

click me!