ఈవిఎంలపై చర్చ: మీరేమనుకుంటున్నారో రాయండి

By telugu teamFirst Published Apr 15, 2019, 6:37 PM IST
Highlights

ఈవిఎంలపై దేశంలో పెద్ద చర్చనే సాగుతోంది. ఈవిఎంల ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

ఈవిఎంలపై దేశంలో పెద్ద చర్చనే సాగుతోంది. ఈవిఎంల ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను ప్రవేశపెట్టాలని ఓ ఉద్యమాన్నే లేవదీశారు. 

ఎన్నికల కమిషన్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఈవిఎంల ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం లేదని అంటోంది. సాంకేతిక సమస్యలపై ఈవిఎంలు మొరాయించే అవకాశం మాత్రమే ఉంది గానీ అక్రమాలకు పాల్పడే లేదా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదని అంటోంది.

ఈ విషయంపై మీ అభిప్రాయాలను పంపిస్తే ఏషియా నెట్ న్యూస్ లో ప్రచురిస్తాం. మీ అభిప్రాయాలను ఈ కింది మెయిల్ అడ్రస్ కు పంపించండి.

pratapreddy@asianetnews.in

click me!