కొందరేమో ఈ లాక్ డౌన్ కి మద్దతు తెలుపుతుండగా మరికొందరేమో ఆర్థికప్రగతి కుంటుపడిపోతుందని భయపడుతున్నారు. ఇప్పటికే దేశంలో ఆర్థికప్రగతి కుంటుపడింది. ప్రపంచంలో నెలకొన్న ఆర్ధిక మాంద్యం ఇప్పటికే భారతదేశంపై పంజా విసరడం ఆరంభించి చాలా కాలం అయింది. ఈ కరోనా లాక్ డౌన్ వల్ల అది మరికొంత ఎక్కువయింది.
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచమంతా వణికిపోతుంది. అన్ని దేశాలు కూడా ఈ వైరస్ కి ఇంకా మందు లేకపోవడం, వాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇంకో సంవత్సర కాలం పట్టనున్న నేపథ్యంలో అన్ని దేశాలు కూడా చేసేదేమి లేక లాక్ డౌన్ పాటించడమే మార్గంగా భావించి లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి.
భారతదేశం కూడా ఇదే దారిలో పయనిస్తూ లాక్ డౌన్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత నెల 24వ తేదీన భారత ప్రధాని 21 రోజుల లాక్ డౌన్ ని ప్రకటించిన విషయం తెలిసిందే.
undefined
ఆ ప్రకటించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14 నేపథ్యంలో నేడు మరోసారి ప్రధాని నరేంద్రమోడీ మరోమారు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ లాక్ డౌన్ పై స్పందిస్తూ, లాక్ డౌన్ ని ఇంకో వారం నుంచి రెండు వారల పాటు పొడిగిస్తే మంచిది అన్నారు.
ఇక కొందరేమో ఈ లాక్ డౌన్ కి మద్దతు తెలుపుతుండగా మరికొందరేమో ఆర్థికప్రగతి కుంటుపడిపోతుందని భయపడుతున్నారు. ఇప్పటికే దేశంలో ఆర్థికప్రగతి కుంటుపడింది. ప్రపంచంలో నెలకొన్న ఆర్ధిక మాంద్యం ఇప్పటికే భారతదేశంపై పంజా విసరడం ఆరంభించి చాలా కాలం అయింది. ఈ కరోనా లాక్ డౌన్ వల్ల అది మరికొంత ఎక్కువయింది.
ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రమే ఈ ఆర్ధిక ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఆఖరకు ఉద్యోగుల జీతాలు;లో కూడా కొత్త విధించాల్సి వచ్చింది. మిగులు బడ్జెట్ కలిగిన తెలంగాణ పరిస్థితే ఇలా ఉంటె, ఆర్ధిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరుగా చెప్పనవసరం లేదు.
ఇప్పటికే ఆర్ధిక ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. ఆర్థికంగా రాబడి తెచ్చిపెట్టే మార్గాలే తక్కువ కలిగిన కొత్త రాష్ట్రం అవడం వల్ల అక్కడి ఆర్ధిక పరిస్థితి ఏమిటో మనం ఊహించుకోవచ్చు. ఇప్పటికే సంక్షేమ పథకాల పేరిట ప్రభుత్వం విపరీతంగా ఖర్చు పెడుతుంది.
నవరత్నాలు అయ్యే ఖర్చే రాష్ట్రానికి తడిసిమోపెడవుతుంటే.... ఇప్పుడు ఆర్ధిక రాబడి మార్గాలు పూర్తిగా మూసుకుపోయిన వేళ, వాటికి తోడుగా కరోనా మహమ్మారిపై పోరాటం, ఆదాయం కోల్పోయిన ప్రజలకు ఆహరం అందించడం అన్ని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ఆర్ధిక భారాన్ని మోపుతున్నాయి.
ఇక నిన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్న ఈ కరోనా లాక్ డౌన్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ను పొడిగించే ఉద్దేశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజారోగ్య సమస్యలు తలెత్తడంతో రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని తెలిపారు.
Also Read:మడమ తిప్పని వైఎస్ జగన్: ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ కు ఉద్వాసన
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతోనే ముందుకెళ్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. దేశంలో లాక్ డౌన్ వల్ల విపత్కర పరిస్థితులు నెలకొన్న విషయం వాస్తవం. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆర్ధిక ప్రగతి కుంటుపడింది. ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం రెండవ ఆప్షన్ తీసుకోలేదు కాబట్టి గత్యంతరం లేక లాక్ డౌన్ విధించింది.
దేశం మొత్తంలో లాక్ డౌన్ ని అకస్మాత్తుగా ప్రకటించారు. అలానే అకస్మాత్తుగా మాత్రం తొలగించరు. అదే విషయాన్నీ మొన్న ప్రధాని ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్సులో చెప్పారు.
ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో లాక్ డౌన్ ని కొనసాగించాలా వద్ద అనే సందిగ్ధ పరిస్థితుల్లో పడ్డారు. లాక్ డౌన్ కొనసాగించమంటే... రాష్ట్రంపై పడే ఆర్ధిక భారం.
ఇప్పటికే రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు ఎందరో పనుల్లేక ఇండ్లలో ఖాళీగా ఉన్నారు. ఆర్ధిక వ్యవస్థ అంతా కుంటుపడి ఉంది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేసినా ఆర్ధిక వ్యవస్థ కోలుకోవడానికి కనీసం ఇంకో 15 రోజులు పడుతుంది. అలాంటిది మరలా లాక్ డౌన్ పొడిగింపు అంటే.... రాష్ట్రంపై పడే ఆర్ధిక భారం ఎంతటిదో చెప్పాల్సిన అవసరం లేదు.
పోనీ లాక్ డౌన్ వద్దు అందామంటే, కరోనా వల్ల పరిస్థితి ఏమయినా చేయిదాటితే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు రూపంలో ప్రతిపక్ష నేత కూర్చొని ఉన్నాడు. కరోనా వ్యాప్తి ఎక్కువైతే దానివల్ల కలిగే అనర్థాలకు అన్నిటికి జగన్ మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాల్సి వస్తుంది.
ఈ సంకట పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డిగారు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నారు. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది జగన్ మోహన్ రెడ్డిగారి పరిస్థితి.