ఎపీలో కొత్త జిల్లాల రగడ: వైఎస్ జగన్ సీరియస్ వార్నింగ్

By Sirisha SFirst Published Aug 10, 2020, 4:08 PM IST
Highlights

తాజాగా 26 జిల్లాలు అని ప్రతిపాదన వచ్చింది. కొత్త జిల్లాలపై కమిటీలు కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గతంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయం చర్చకు రాగానే వైసీపీ నుంచే చాలా గొంతుకలు వినిపించాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కమిటీని నియమించింది. ఒక్కో లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేయనున్నట్టు జగన్ ఎన్నికల సందర్భంగానే ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఉన్న 13 జిల్లాలకు తోడుగా మరో 12 జిల్లాలు అవుతాయని అంతా అన్నారు. 

తాజాగా 26 జిల్లాలు అని ప్రతిపాదన వచ్చింది. కొత్త జిల్లాలపై కమిటీలు కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గతంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయం చర్చకు రాగానే వైసీపీ నుంచే చాలా గొంతుకలు వినిపించాయి. 

సీనియర్ నేత, మంత్రి ధర్మాన కృష్ణదాసు సోదరుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మొన్న వైసీపీ పెద్దల సమక్షంలోనే జిల్లాల విభజన ,రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో శ్రీకాకుళం అభివృద్ధిని గురించి ప్రస్తావిస్తూ..... శ్రీకాకుళం జిల్లాను గనుక విభజిస్తే చాలా సమస్యలు వస్తాయని, శ్రీకాకుళం అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు.

శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాన్ని గనుక విడదీస్తే ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలు విజయనగరం జిల్లా పరిధిలోకి వెళ్లిపోతాయి. పాలకొండ అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వెళ్లిపోతాయి. అవి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి రావు.

విజయనగరం జిల్లాలో సైతం పార్వతీపురం, సాలూరు, కురుపాం అన్ని కూడా అరకు పరిధిలోకి వెళ్లిపోతాయి. వారికి ఏండ్లుగా విజయనగరంతో ఉన్న సంబంధాలు అన్ని వారు వదులుకోవాలిసి వస్తుంది. ఇది ఏ రెండు నియోజికవర్గాలకో పరిమితం కాదు. చాలా నియోజకవర్గాల్లో కూడా మనకు ఇలాంటి పరిస్థితులు కనబడుతాయి.

విజయనగరం జిల్లా పరిధిలోని పార్వతీపురం వాసులు ఇప్పటికే తమ జిల్లాను ప్రత్యేక జిల్లాగా చేయాలని ర్యాలీలు తీస్తున్నారు. పార్టీలకతీతంగా అక్కడ నాయకులంతా జిల్లా సాధన ఉద్యమాలు చేపడుతున్నారు. ఇక చిత్తూరు జిల్లా మదనపల్లె వాసులయితే ఏకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసారు. తమ మాధానపల్లెను అయితే ప్రత్యేక జిల్లాగా, లేదంటే... చిత్తూరు జిల్లాలోనైనా, లేదంటే.... కర్ణాటకలోనయినా కలపండి అని అంటున్నారు.

తెలంగాణాలో సైతం జిల్లాల ఏర్పాటప్పుడు ఎంత రచ్చ జరిగిందో అందరూ చూసారు. ప్రతిఒక్కరు తమకు ప్రత్యేక జిల్లా కావాలని ఉద్యమాలు చేసారు. సాధారణంగా ఒక జిల్లాలో కనీసం 5 నుంచి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి.

ఇక ఈ తతంగాలను చూసిన జగన్ మొన్నటి కాబినెట్ భేటీలో మంత్రివర్గం మొత్తానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.  ప్రభుత్వ వైఖరిలో ఎవ్వరు కూడా తల దూర్చవద్దని జగన్ హెచ్చరించినట్టు సమాచారం. 

పూర్తిగా అధికారుల ఆధ్వర్యంలోనే ఈ విభజన జరుగుతుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయ జోక్యం సహించేదిలేదని జగన్ గట్టిగానే చెప్పారట. ఇలా గనుక కొత్త విషయాలను తెరమీదకు తీసుకొస్తే.... కొత్త సమస్యలు వస్తాయని, వాటికి చెక్ పెట్టేందుకు జగన్ ఈ విషయంగా మంత్రులను హెచ్చరించినట్టు తెలియవస్తుంది. 

click me!