కాషాయ రంగు వేషధారణలో ఒక యువకుడు సభలో కూర్చొని ఉన్నాడు. ఇతనిని మాట్లాడడానికి ఆహ్వానించినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు కూడా. పక్కవారితో ముచ్చట్లలో మునిగి కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు.
ఒక్కసారిగా గంభీరమైన కంఠంతో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అఫ్ అమెరికా అన్నాడో, అందరూ అలెర్ట్ అయ్యి ఆ వక్తను ఆలకించడం మొదలు పెట్టారు. అతని ప్రసంగం పూర్తయిన తరువాత నిలుచొని స్టాండింగ్ ఒవేషన్ (లేచి నిలబడి కరతాళ ధ్వనులతో మెచ్చుకోవడం). ఇచ్చారు.
అతనే నరేంద్రుడు ఉరఫ్ స్వామి వివేకానంద. మళ్ళీ 126 ఏళ్ల తరువాత మరో నరేంద్రుడు అమెరికాలో ఈ రకమైన స్పీచ్ ఇచ్చి అక్కడి ప్రజలను కట్టిపడేసాడు. అతనే మన ప్రధాని నరేంద్రమోడీ. కాకతాళీయంగా ఇరువురు పేర్లు కూడా ఒకటే
undefined
ఆ రోజు ఆ నరేంద్రుడు కూడా సోదర భావాన్నే ప్రస్ఫుటంగా వినిపిస్తే, ఈ నరేంద్రుడు కూడా అదే భావనను వెలిబుచ్చాడు. ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే ఇరువురు ప్రసంగించింది కూడా ఈ సెప్టెంబర్ మాసంలోనే
స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న ప్రసంగిస్తే, ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 22వ తేదీన ప్రసంగించారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడే ఈ ఈవెంట్ కు హాజరయ్యి ప్రధాని ప్రసంగం పూర్తయ్యేవరకు ఆసక్తిగా విన్నారు.
ఆ నాడు ఆ నరేంద్రుడు తన ప్రసంగం ద్వారా యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తే నేడు మన ప్రధాని మోడీ కూడా ప్రపంచ దేశాలన్నీ తన స్పీచ్ వినేలా చేసి భారత దేశ గౌరవాన్ని ప్రతిష్టను మరింతగా పెంపొందించారు అనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు.