ఆ ఊరంతా పెళ్లికాని ప్రసాదులే.. ఒక్కొరికి కూడా పెళ్లి కావడం లేదు

By telugu teamFirst Published Oct 14, 2019, 8:21 AM IST
Highlights

కాన్పూర్ జిల్లాలోని ఢిల్లీ జాతీయ రహదారికి పక్కన ఉన్న  బదువాపూర్, పన్కీపడాకా, జుమాయి, సరయమిత్ర గ్రామాల్లో పెళ్లి కాని యువకుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ ఊళ్లకు సమీపంలో పురపాలక డంపింగ్ యార్డు ఉండటమే కారణం.

వయసు మీద పడుతున్నా... పెళ్లి కాని అబ్బాయిలను పెళ్లి కాని ప్రసాద్ అంటూ సరదాగా పిలుస్తూ ఉంటారు. తమకు పెళ్లి చేసుకోవాలని ఆశ ఉన్నా... తమకు పిల్లనివ్వడానికి ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో... నాలుగు గ్రామాల్లో అబ్బాయిలందరూ పెళ్లి కాని ప్రసాదుల్లానే మిగిలిపోయారు. అలా అని ఆ గ్రామాల్లోని యువకులకు చదువు, ఉద్యోగం లాంటివి ఏమైనా లేవా అంటూ ఉన్నాయి. ఆస్తి పరులు కూడా చాలా మందే ఉన్నారు. అయినా సరే.... ఆ యువకులకు తమ పిల్లలునన ఇవ్వమని తండ్రులు తేల్చి చెబుతున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలోని ఢిల్లీ జాతీయ రహదారికి పక్కన ఉన్న  బదువాపూర్, పన్కీపడాకా, జుమాయి, సరయమిత్ర గ్రామాల్లో పెళ్లి కాని యువకుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ ఊళ్లకు సమీపంలో పురపాలక డంపింగ్ యార్డు ఉండటమే కారణం. డంపింగ్ యార్డ్ నుంచి వస్తున్న కంపు, మురికి వాసనతో ఆయా గ్రామాల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో నాలుగు గ్రామాల యువకులకు అమ్మాయిని ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావడంలేదు. డంపింగ్ యార్డు దుర్గంధం, జబ్బుల బారిన పడుతున్న విషయాలను గమనించి బంధుత్వాలను తెంచుకుంటున్నారని ఆ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఆ ప్రాంతంలో డంపింగ్ యార్డు ఉండటం తప్పేమి కాదంటున్న అధికారులు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

click me!