వరుడు పెళ్లి క్యాన్సిల్ చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
అమెరికాలోని టెక్సాస్ లో చిత్తూరు జిల్లాకు చెందిన యువతి సోమవారం ఆత్మహత్య పాల్పడింది. పెళ్లి నిశ్చయమైన తర్వాత వరుడు పెళ్లి క్యాన్సిల్ చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా... ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతిరాలి తల్లిదండ్రులు చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... చిత్తూరు నగరంలోని పోలీసు కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మ(25) అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తోంది. జిల్లాలోని పూతలపట్టు మండలం బందారపల్లికి చెందిన మురళి కుమారుడు భరత్ టెక్సాస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వారిద్దరూ అక్కడే ఉండటంతో ఇరు కుటుంబ సభ్యులు వారికి పెళ్లి నిశ్చయించారు.
ఈ నెల మూడో తేదీన పెళ్లి తేదీ కూడా కన్ఫామ్ చేశారు. అయితే.. పది రోజుల క్రితం వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో భరత్ తనకు పెళ్లి వద్దంటూ తేల్చి చెప్పాడు. దీంతో ఇరుకుటుంసభ్యులు యువతీయువకులను నచ్చచెప్పే ప్రయత్నం ేశారు.
కొద్దిరోజుల తర్వాత అన్నీ సర్దుకుంటాయని పెద్దలు భావించారు. అయితే.. భరత్ తనకు పెళ్లి వద్దని తేల్చిచెప్పాడు. దీంతో.. సుష్మ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.