ప్రసవానికొచ్చిన భార్య.. ఆస్ట్రేలియాకు వెళుతుండగా, భర్త మరణవార్త

By Siva Kodati  |  First Published Feb 27, 2021, 8:45 PM IST

ఆస్ట్రేలియాలో తెలుగు ఎన్ఆర్ఐ అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన హరీశ్ బాబు ఆరేళ్లుగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్ రాష్ట్రం సలిస్‌బరిలో నివసిస్తున్నారు.

ఆస్ట్రేలియాలో తెలుగు ఎన్ఆర్ఐ అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన హరీశ్ బాబు ఆరేళ్లుగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్ రాష్ట్రం సలిస్‌బరిలో నివసిస్తున్నారు.

ఆయన భార్య డెలివరీ కోసం భారత్‌కు వచ్చింది.. అయితే ఇలాగో ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించడంతో ఆమె తిరిగి ఆస్ట్రేలియా వెళ్లలేకపోయారు. తాజాగా కోవిడ్ నిబంధనలు సడలిస్తుండటంతో హరీశ్ బాబు భార్య బిడ్డతో పాటు నిన్న ఆస్ట్రేలియాకు బయల్దేరారు.

Latest Videos

ఈ నేపథ్యంలో చెన్నైకు చేరుకుని ఆమె భర్తకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో బంధువులు ఆస్ట్రేలియాలో ఇరుగుపొరుగు వారిని ఆరా తీయడంతో హరీశ్ మరణవార్త తెలిసింది.

భార్య పుట్టింటికి వచ్చిన నాటి నుంచి ఆయన పరాయి దేశంలో ఒంటరిగానే వుంటున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్ మరణవార్త తెలియడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఆయన మరణానికి కారణాలు తెలియాల్సి వుంది. 

click me!