నదిలో స్విమ్మింగ్‌ చేస్తూ: అమెరికాలో విశాఖ విద్యార్ధి మృతి

Siva Kodati |  
Published : Aug 21, 2019, 08:19 AM ISTUpdated : Aug 21, 2019, 08:21 AM IST
నదిలో స్విమ్మింగ్‌ చేస్తూ: అమెరికాలో విశాఖ విద్యార్ధి మృతి

సారాంశం

ఎం.సుమీద్ అమెరికాలోని పోర్టులాండ్‌లో ఎం.ఎస్.రోబోటిక్స్ చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం 4.30కు క్రీటర్‌లాక్ నదికి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అతను ఈతకు వెళ్లాడు. ప్రవాహం అధికంగా డటంతో పాటు లోతు ఎక్కువగా ఉండటంతో సుమీద్ మునిగిపోయాడు

అమెరికాలో తెలుగు విద్యార్ధి మరణించాడు. విశాఖపట్నం సీతమ్మధార ఎన్ఆర్ఐ ఆసుపత్రి సమీప ప్రాంతానికి చెందిన ఎం.ఎస్.కుమార్ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు.

ఆయన కుమారుడు ఎం.సుమీద్ అమెరికాలోని పోర్టులాండ్‌లో ఎం.ఎస్.రోబోటిక్స్ చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం 4.30కు క్రీటర్‌లాక్ నదికి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అతను ఈతకు వెళ్లాడు.

ప్రవాహం అధికంగా డటంతో పాటు లోతు ఎక్కువగా ఉండటంతో సుమీద్ మునిగిపోయాడు. అతని మరణవార్తతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సుమీద్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..