అమెరికాలో వేములవాడ యువకుడి మృతి.. బోటు కోసం నీటిలోకి దిగి గల్లంతు...

By SumaBala BukkaFirst Published May 31, 2022, 9:32 AM IST
Highlights

అమెరికాలో వేములవాడకు చెందిన విద్యార్థి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అలల తాకిడికి సముద్రంలో గల్లంతై అతను మృతి చెందాడు. 

వేములవాడ : americaలోని ఫ్లోరిడాలో ఉన్నత చదువులకు వెళ్లిన వేములవాడ యువకుడు కంటె యశ్వంత్‌ (25) Excursionకు వెళ్ళి సముద్రంలో అలల తాకిడికి మరణించాడు. ఈ మేరకు తల్లిదండ్రులకు సమాచారం అందింది. యశ్వంత్ మిత్రులు,  కుటుంబ సభ్యుల సమాచారం మేరకు… Vemulawada సుభాష్ నగర్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు కంటె మల్లయ్య కుమారుడు యశ్వంత్ ఎమ్మెస్ చదివేందుకు ఎనిమిది నెలల క్రితం Florida వెళ్ళాడు.

వీకెండ్ కావడంతో ఈ నెల 29న యశ్వంత్, అతడి స్నేహితులు శుభోదయ్, మైసూరా, చరణ్, శ్రీకర్, శార్వరీలతో కలిసి ఐర్లాండ్లోని దీవులకు వెళ్లారు. అక్కడే ప్రైవేట్ బోటు తీసుకుని పిటా దీవుల వద్దకు చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం 5.35 గంటలకు  బోటు స్టార్ట్ చేయగా.. ఇంజిన్ ఆన్ కాలేదు. అలల తాకిడికి బోటు మూడు మీటర్ల లోతు ప్రాంతం నుంచి... 25 మీటర్ల లోతు ప్రాంతానికి చేరుకుంది.

ఇది గమనించిన యశ్వంత్ నీటిలోకి దిగాడు. అలలు ఎక్కువగా ఉండడంతో ఎంత ఈతకొట్టినా బోటును చేరుకోలేకపోయారు. యశ్వంత్ ను కాపాడేందుకు మిత్రులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. లైఫ్ జాకెట్స్ ధరించి నీటిలోకి దిగి దాదాపు మూడు గంటలపాటు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు ఈ విషయాన్ని యశ్వంత్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు.  మిత్రుడిని కోల్పోయిన దు:ఖంలో వీరంతా సమీపంలోని వసతి గదులకు చేరుకున్నారు.  పోలీసులు గాలింపు చేపట్టగా.. సోమవారం రాత్రి మృతదేహం లభ్యం అయినట్లు తెలిసింది. ఉన్నత చదువులకు వెళ్లిన యశ్వంత్ మృతితో సుభాష్ నగర్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. 

కాగా, Saudi Arabiaలోని మక్కాలో మే 24న విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన NRI ప్రమాదవశాత్తు ఓ భవనం మీదినుంచి పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం (మే 22న) జరిగింది. మృతుడిని మొహిద్దీన్ అజీజ్ గా గుర్తించారు. అతని స్వస్థలం హైదరాబాద్ లోని యాకుత్ పురా. గత పదేళ్ల నుంచి సౌదీ అరేబియాలో పని చేస్తున్నాడు. Jeddahలోని అజిజియా ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నట్లు అతని బంధువులు తెలిపారు. 

Makkahలో టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం కూడా డ్యూటీకి వెళ్లిన అజీజ్ పనిచేసే చోట ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి చనిపోయాడు. ఇక ఈ ఘటనపై భారత కాన్సులేట్, లోకల్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని స్థానికంగా ఖననం చేయనున్నట్లు అజీజ్ కుటుంబ సభ్యులు తెలిపారు. 

ఇదిలా ఉండగా, మే 11న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి క్రాంతి కిరణ్ రెడ్డి దుర్మరణం చెందాడు. మిస్సోరి రాష్ట్రం వారెన్స్‌బగ్‌లో ఈనెల 7వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తెలుగు విద్యార్థి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం…  నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,  అరుణ దంపతుల చిన్న కుమారుడు Kranti Kiran Reddy (25) ఎంఎస్ చదివేందుకు గత ఏడాది లోని మిస్సోరీ  సెంట్రల్ యూనివర్సిటీ కి వెళ్ళాడు. ఈనెల 7వ తేదీన రాత్రి ఏడున్నర గంటలకు స్నేహితులతో కలిసి వెడుతుండగా వీరి కారును ఓ కంటైనర్‌ ఢీకొట్టింది.

డ్రైవర్ పక్కనే కూర్చున్న కిరణ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు మిగిలిన ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమెరికాలోనే ఉంటున్న శ్రీనివాస్ రెడ్డి బావమరిది మంగళవారం సమాచారం ఇవ్వడంతో విషయం తెలిసింది. క్రాంతి కిరణ్ రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి రెండు, మూడు రోజుల్లో తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు  బంధువులు తెలిపారు.

click me!