స్కూల్లోని కాఫీటేరియాలో కూర్చున్న విద్యార్థిపై ఇతరులు దాడి చేశాడు. మెడ నొక్కుతూ.. కింద పడేసి మరీ దాడి చేశారు. సీటు లో నుంచి లేవమని అడిగితే లేవలేదనే కోపంతో ఈ దాడి చేయడం గమనార్హం.
అమెరికాలో భారతీయ విద్యార్థికి బెదిరింపులు ఎదురయ్యాయి. తోటి విద్యార్థులే అతనని బెదిరించడం గమనార్హం. స్కూల్లోని కాఫీటేరియాలో కూర్చున్న విద్యార్థిపై ఇతరులు దాడి చేశాడు. మెడ నొక్కుతూ.. కింద పడేసి మరీ దాడి చేశారు. సీటు లో నుంచి లేవమని అడిగితే లేవలేదనే కోపంతో ఈ దాడి చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం గమనార్హం.
ఈ వీడియో ప్రకారం ఒక బెంచీపై కూర్చున్న భారతీయ అమెరికన్ అబ్బాయి దగ్గరకు అమెరికన్ విద్యార్థి వచ్చి లేచి నిలబడమని అడిగినట్లు వుంది. కూర్చున్న విద్యార్థి లేవడానికి నిరాకరించడంతో అమెరికన్ విద్యార్థి కోపంగా అతని మెడచుట్టూ మోచేతిని బిగించి, మెడను నొక్కి ఊపిరి ఆడకుండా చేసి, తలను వెనక్కు వంచాడు. ఈ సంఘటన టెక్సాస్‌లోని కొప్పెల్ మిడిల్ స్కూల్‌లో జరిగింది.
14 y/o at Coppell Middle School North gets assaulted in the cafeteria, while students just watched.
Teen in chokehold faced 3days of punishment. His parents are outraged. Other teen faced 1 day of punishment.
Teen tells me, he didn't want to fight back, & get in trouble. pic.twitter.com/f2Clha8qpF
ఈ సంఘటన గురించి ఆ స్కూల్ సూపరింటెండెంట్ డా.బ్రాడ్‌హంట్ ”కోపెల్ మిడిల్ స్కూల్ నార్త్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణను చూపించే వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందని కొప్పెల్ ఐఎస్‌డికి తెలుసు. బెదిరింపులు, అరవడం, శారీరకంగా హింసించడంలాంటి చర్యలు ఎప్పటికీ ఆమోద యోగ్యం కాదు.మేము మా ప్రధాన విలువలతో ఏకీభవిస్తాము.” అంటూ ఇమెయిల్ పెట్టాడు.
ఈ సంఘటనపై స్కూల్ నిబంధనల ప్రకారం దర్యాప్తు జరుగుతోంది. చాలామంది వీడియోలో దాడిని స్పష్టంగా చూపించారనే వాస్తవాన్ని ఎత్తి చూపడంతో విస్తృతంగా విమర్శలు వచ్చాయి. ఎన్‌బిసిడిఎఫ్‌డబ్ల్యు ప్రకారం వేధింపులకు గురైన విద్యార్థి తల్లిదండ్రులు తమ కొడుకు తిరిగి పోరాడాలని, అమెరికన్ విద్యార్థిని ఇబ్బందుల్లో పెట్టాలని అనుకోలేదని, అయినా కూడా తమ కొడుకును మూడురోజులు సస్పెండ్ చేశారని, దాడిచేసిన విద్యార్థిని ఒక రోజే సస్పెండ్ చేశారని అంటున్నారు. పాఠశాల అంతర్గత విచారణ చేయడానికి వేచి ఉన్నందున తల్లిదండ్రులు ఇప్పుడు న్యాయపరమైన ప్రాతినిథ్యాన్ని కోరారు. ఇండియన్ అమెరికన్ విద్యార్థికి మద్దతుగా 1,50,000 మందికి పైగా సంతకాలు చేసిన ఆన్‌లైన్ పిటిషన్ కూడా ఉంది.