హెచ్1- బీ వీసాకు ఫుల్‌డిమాండ్: వారంలో 65వేల దరఖాస్తులు.. కానీ

By Siva Kodati  |  First Published Apr 7, 2019, 10:40 AM IST

హెచ్1- బీ వీసాల కోసం వారం లోపే 65 వేల దరఖాస్తులు వచ్చాయని యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది. ఇప్పటికే వీసా నుంచి పరిమితి పొందిన వారి నుంచి పిటిషన్లు పరిశీలిస్తామని కూడా తెలిపింది. అయితే కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించి హెచ్1 బీ వీసాలు కేటాయిస్తారా? లేదా? అన్న సంగతి తేల్చలేదు.
 


2020లో ఇప్పటికే 65వేల హెచ్‌-1బీ వీసా దరఖాస్తులు వచ్చాయని అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) తెలిపింది. భారతదేశంతోపాటు వివిధ దేశాల నుంచి అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయన్నది.

అమెరికాలోని వివిధ కంపెనీల్లో వృతి నిపుణులుగా పని చేయాలంటే హెచ్‌-1బీ వీసా తప్పనిసరి కావాల్సి ఉంటుంది. భారత్‌, చైనా నుంచి ఏటా వేల సంఖ్యలో ఈ వీసాల కోసం దరఖాస్తులు వస్తుంటాయి.

Latest Videos

undefined

హెచ్1- బీ వీసా దరఖాస్తుల పరిశీలన ఒక ప్రక్రియ 
వివిధ దేశాల్లో కంపెనీల నుంచి వేల సంఖ్య హెచ్‌-1బీ వచ్చే దరఖాస్తులను పరిశీలించడం యూఎస్‌సీఐఎస్‌కు అతి పెద్ద ప్రక్రియ. ‘2020లో కాంగ్రెస్‌ చట్టబద్ధం చేసిన 65వేల దరఖాస్తులు ఇప్పటికే వచ్చాయి’ అని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. 

ఈ నెల ఒకటో తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ
2019 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండగా, ఈ నెల ఒకటో తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఏటా మంజూరు చేసే 65వేల వీసాలకు దరఖాస్తులు ఇప్పటికే వచ్చేశాయి. 

తొలి ఐదు రోజుల్లో వచ్చిన దరఖాస్తులపై స్పష్టతనివ్వని యూఎస్సీఐఎస్
హెచ్1 - బీ వీసా కోసం తొలి ఐదు రోజుల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయో ఎలాంటి వివరాలను యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించలేదు. వీటితోపాటు మాస్టర్‌ డిగ్రీ చదువుకునేవారికి మరో 20వేల హెచ్‌-1బీ వీసాలను అమెరికా మంజూరు చేస్తుంది.

కంప్యూటరైజ్డ్ డ్రాపై స్పష్టతనివ్వని యూఎస్‌సీఐఎస్‌ 
గత కొన్నేళ్లుగా కంప్యూటరైజ్డ్‌ డ్రా పద్ధతిలో వీసాలను మంజూరు చేస్తున్న యూఎస్‌సీఐఎస్‌ ఈసారి కూడా అదే మార్గాన్ని ఎంచుకుంటుందా? లేదా అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. గతేడాది మొత్తం 1.90 లక్షల  హెచ్‌-1బీ దరఖాస్తులు వచ్చాయి. 

మాస్టర్ క్యాప్స్ కోటాలో మరో 20 వేల హెచ్1- బీ వీసాలు
మాస్టర్స్ క్యాప్‌గా పిలిచే అమెరికా అడ్వాన్స్ డిగ్రీ కోటాలో మరో 20 వేల హెచ్-1బీ వీసాలను జారీచేసేందుకు వీలు ఉన్నది. ఇందుకు తగినన్ని పిటిషన్లు వచ్చాయో, లేదో తర్వాత నిర్ధారిస్తామని యూఎస్‌సీఐఎస్ పేర్కొన్నది. ఎంపిక కాని అభ్యర్థులందరికీ వీసా రుసుము తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది.

వీసాల పరిమితి నుంచి మినహాయింపు పొందిన వారి పిటిషన్ల స్వీకరణ
వీసాల పరిమితి నుంచి మినహాయింపు పొందిన అభ్యర్థుల పిటిషన్లను స్వీకరించి వాటిని ప్రాసెసింగ్ ప్రక్రియను కొనసాగిస్తామని తెలిపింది. గతంలో పరిమితికి మించి ప్రత్యేకంగా ఎంపికై ఇప్పటికీ క్యాప్ నంబర్‌తో కొనసాగుతున్న వారికి ఈ ఏడాది జారీచేసే హెచ్-1బీ వీసాల్లో మినహాయింపు ఇచ్చినట్టు యూఎస్‌సీఐఎస్ పేర్కొంది. 

కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహణపై స్పష్టతనివ్వని యూఎస్‌సీఐఎస్‌ 
ఏళ్ల తరబడి ఈసారి కూడా కంప్యూటరైజ్డ్ డ్రా (లాటరీ) నిర్వహిస్తారా? లేదా? అనే విషయమై యూఎస్‌సీఐఎస్ స్పష్టతనివ్వలేదు. హెచ్-1బీ వీసాల కోసం గత ఆర్థిక సంవత్సరం (2018-19) తొలి ఐదు రోజుల్లో 1,90,000 పిటిషన్లు రాగా, 2017-18లో 1,99,000, 2016-17లో 2,36,000, 2015-16లో 2,32,972, 2014-15లో 1,72,581 పిటిషన్లు వచ్చాయి.

‘హౌస్‌ఫుల్‌’ బోర్డు శరణార్థులకు చోటులేదన్న ట్రంప్‌
అమెరికా ఇప్పటికే నిండిపోయిందని అక్రమ వలసదారులకు, శరణార్థులకు ఇక చోటు లేదని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. శుక్రవారం కాలిఫోర్నియాలోని కలెక్సికోలో సరిహద్దు గస్తీ బృందాలు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘అమెరికాలో వలసల వ్యవస్థ భారంగా మారింది. ఇక దీనిని కొనసాగించనివ్వం. ఇకపై కొత్తగా ఎవరికీ ఆశ్రయం ఇవ్వబోం. మా దేశం నిండిపోయింది. అందుకే వెనుదిరిగి వెళ్లడం మంచిది’ అని అన్నారు.

అమెరికాలో ట్రంప్‌కు మద్దతు.. మెక్సికోలో నిరసనలు
ట్రంప్‌ రాక సందర్భంగా మెక్సికో వైపు సరిహద్దు వద్ద మెక్సికలీ పట్టణంలో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ట్రంప్‌ను శిశువు అని పేర్కొంటూ ఒక భారీ బెలూన్‌ను ఎగురవేశారు. దీంతోపాటు అమెరికా, మెక్సికో దేశాల జెండాలను చేతపట్టుకొని ‘కుటుంబాలను విడదీయొద్దు’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు.

అమెరికావైపు మాత్రం ట్రంప్‌కు మద్దతు లభించింది. విమానాశ్రయం నుంచి ఆయన కాన్వాయ్‌ వస్తున్నప్పుడు రోడ్డుకు ఇరువైపులా భారీగా ప్రజలు నిలబడి ‘గోడ నిర్మించండి’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. 

ముందు మెక్సికోకు పొగడ్తలు.. ఆ పై హెచ్చరికలు 
వాషింగ్టన్‌ నుంచి బయల్దేరే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మెక్సికోను పొగిడారు. 4 రోజులుగా మెక్సికో చాలా బాగా సరిహద్దులను మూసివేసిందన్నారు. మెక్సికో అక్రమ వలసలను, మాదక ద్రవ్యాల రవాణాను ఆపకపోతే ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై 25శాతం ఛార్జీ విధిస్తామని హెచ్చరించారు.

మెక్సికోపై టారీఫ్‌లు విధిస్తామని హెచ్చరించడం ఇదే ప్రథమం. సమస్యల పరిష్కారానికి మెక్సికోకు ఏడాది సమయం ఇచ్చారు. అయితే ఇప్పటికే అమెరికాతో యూఎస్‌‌ఎంసీఏ ఒప్పందం ఉండటంతో  ఎంతవరకు ఈ టారిఫ్‌లు విధిస్తారనే దానిపై స్పష్టత లేదు. ట్రంప్‌ దీనిపై కూడా మాట్లాడుతూ‘యూఎస్‌ఎంసీఏ గొప్పడీల్‌.

ఇది మెక్సికోకు బాగా ఉపయోగపడుతుంది. కానీ ఈ నిర్ణయం యూఎస్‌ ఎంసీఏను కూడా ఆశ్చర్య పరుస్తుంది’ అని పేర్కొన్నారు. 

click me!