హెచ్1 బీ వీసా కుంభకోణం... నిందితులు ముగ్గురూ తెలుగువారే..

By ramya NFirst Published Apr 3, 2019, 10:55 AM IST
Highlights

హెచ్1 బీ వీసా కుంభకోణంలో ముగ్గురు ఎన్ఆర్ఐలు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ ముగ్గురు నిందితులు తెలుగువారే కావడం గమనార్హం. 


హెచ్1 బీ వీసా కుంభకోణంలో ముగ్గురు ఎన్ఆర్ఐలు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ ముగ్గురు నిందితులు తెలుగువారే కావడం గమనార్హం. సాంటాక్లారాకు చెందిన దత్తపురం కిశోర్‌(49), టెక్సాస్‌ రాష్ట్రం ఆస్టిన్‌ నివాసి కుమార్‌ అశ్వపతి(49), సాన్‌జోస్‌కు చెందిన సంతోష్‌ గిరి(42) కలిసి సాంటాక్లారాలో నానోసెమాంటిక్స్‌ అనే కన్సల్టింగ్‌ సంస్థను నడిపేవారు. 

వీరు కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉండే సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ సంస్థలకు అవసరమైన విదేశీ వృత్తి నిపుణులను ఎంపిక చేసేవారు.కానీ, వీరు హెచ్‌–1బీ వీసాకు కీలకమైన ఐ–129 దరఖాస్తు సమర్పించేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. 

పలు ప్రముఖ కంపెనీలతోపాటు తమ నానోసెమాంటిక్స్‌కు ఫలానా ఉద్యోగం కోసం విదేశీ నిపుణుల అవసరం ఉందంటూ నకిలీ పత్రాలతో ‘ఐ–129’దరఖాస్తు చేసేవారు. అలా వచ్చిన వారికి ఆ తర్వాత స్థానిక కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేవారు. 

ఇందుకుగాను వారి నుంచి కొంతమొత్తంలో వసూలు చేసేవారు. వాస్తవానికి ఆయా సంస్థల్లో ఎలాంటి ఖాళీలు ఉండవు. అభియోగాలు రుజువైతే గరిష్టంగా పదేళ్ల జైలు, రూ.1.50 కోట్ల జరిమానాతోపాటు ఒక్కో నేరానికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.  

click me!