విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త తెలిపారు. ఎప్పటి నుంచో ఆధార్ కార్డ్ పొందాలని ఎదురుచూస్తున్న వారి కోసం ఆమె నిబంధనలు సడలించారు
విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త తెలిపారు. ఎప్పటి నుంచో ఆధార్ కార్డ్ పొందాలని ఎదురుచూస్తున్న వారి కోసం ఆమె నిబంధనలు సడలించారు.
ఎన్‌ఆర్ఐలకు సైతం ఆధార్ కార్డ్‌లు అందిస్తామని నిర్మల ప్రకటించారు. 2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ఆమె శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకున్న వెంటనే మిగిలిన భారతీయులతో సమానంగా నిర్ణీత గడువులోగా ఎన్ఆర్ఐలకు కూడా ఆధార్ కార్డు లభిస్తుందన్నారు.
గతంలో ఎన్ఆర్ఐలు ఆధార్ కార్డ్ పొందాలంటే 180 రోజులు భారత్‌లో ఉండాలనే నిబంధన ఉండేది. ఈ నిబంధనను సడలిస్తూ భారత పాస్‌పోర్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్‌ను మంజూరు చేస్తామని తెలిపారు. ఆధార్ కార్డ్ ద్వారా దేశ ప్రజల వేలిముద్రలు, ముఖ కవళికలతో పాటు వ్యక్తిగత వివరాలను డేటాబేస్‌లో భద్రపరుస్తారు.