ఈ ఏడాది ఆరంభం జనవరి మాసంలో అమెరికా న్యూ జెర్సీ రాష్ట్రం ఎడిసన్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణవాసి నల్లమడ దేవేందర్ తో పాటు కుటుంబంమొత్తం మరణించింది.
నల్గొండ: ఉపాధి నిమిత్తం అమెరికాలో వుంటూనే స్వరాష్ట్రం కోసం పోరాడిన టీఆర్ఎస్ పార్టీకోసం పనిచేసేవాడు నల్లమడ దేవేందర్. అయితే ఈ ఏడాది ఆరంభం జనవరి మాసంలో అమెరికా న్యూ జెర్సీ రాష్ట్రం ఎడిసన్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో అతడితో పాటు కుటుంబం మొత్తం మరణించింది. దీంతో తీవ్ర వేధనలో వున్న దేవేందర్ కుటుంబానికి ఎన్నారై టి.ఆర్.ఎస్ యు.ఎస్.ఏ సభ్యులకు బాసటగా నిలిచారు.
దేవేందర్ అకాల మరణంతో వారి కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిందని టి.ఆర్.ఎస్ యు.ఎస్.ఏ సభ్యులు మహేష్ తన్నీరు ఆవేధన వ్యక్తం చేశారు. తోటి టి.ఆర్.ఎస్ యు.ఎస్.ఏ సభ్యులు శ్రీనివాస్ గనగోని, చందు తాళ్ల, పూర్ణ బైరి, వెంగల్ జలగం, అరవింద్ తక్కళ్లపల్లి, నరసింహ నాగులవంచ, సక్రు నాయక్, మహేష్ పొగాకు, హరిందర్ తాళ్లపల్లి మరియు వారి మిత్రులు, టోనీ జన్ను, రిషికేష్ రెడ్డి, వ్యాల్ల హరీష్ రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీనివాస్ సురభి, మోహిత్ కర్పూరం, నవీన్ కానుగంటి, రజినీకాంత్ కూసానం బాసటగా నిలిచారు.
ఈ మేరకు ఎన్నారై టి.ఆర్.ఎస్ యు.ఎస్.ఏ చైర్మన్ తన్నీరు మహేష్, సభ్యులు నవీన్ జలగం, శశి దొంతినేని హైదరాబాద్ లోని దేవేందర్ తల్లి భారతమ్మ గారిని కలిసి పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే వారికి రూ. 7,18,000/- ఆర్థిక సహాయాన్ని డి.డి ద్వారా అందచేశారు. ఈ సందర్భంగా తన్నీరు మహేష్ గారు బాధిత కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
undefined
హైదరాబాద్ లో విద్యాబ్యాసం కొనసాగించిన దేవేందర్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసేవారు. ఈయన స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ కాగా హైదరాబాద్ లో నివాసముంటున్నారు.