ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలని లండన్‌లో టీఆర్ఎస్ యూకే శాఖ ప్రత్యేక పూజలు (ఫోటోలు)

Published : Sep 16, 2018, 01:15 PM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలని లండన్‌లో టీఆర్ఎస్ యూకే శాఖ ప్రత్యేక పూజలు (ఫోటోలు)

సారాంశం

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి అధికారం చేపట్టాలని కోరుతూ హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. 

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి అధికారం చేపట్టాలని కోరుతూ హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ యూకే కార్యవర్గ సభ్యులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ వందకు పైగా సీట్లు గెలిచి కేసీఆర్ మరోసారి సీఎం అవ్వాలని.. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని పూజలు నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలంతా టీఆర్ఎస్‌కే ఓటేసి గెలిపించాలని నాయకులు కోరారు.

అలాగే ఇటీవల కొండగట్టు బస్సు ప్రమాదంలో ప్రాణాలో కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. ఇటువంటి ఘటనలు జరకుండా ప్రజలందరినీ కాపాడాలని వారు దేవుణ్ని కోరుకున్నారు.

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..