తెలంగాణ పీసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటి రామారావు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసి ఎన్నారెై సెల్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నారై మంత్రి కేటిఆర్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా వారు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కేటీఆర్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
లండన్: తెలంగాణ పీసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటి రామారావు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసి ఎన్నారెై సెల్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నారై మంత్రి కేటిఆర్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా వారు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కేటీఆర్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ ఎన్నారై సెల్ యూకే కన్వీనర్ గంప వేణుగోపాల్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...
undefined
2014 ఎన్నికల మేనిఫెస్టో లో ఎన్నారై లకు ఇచ్చిన వాగ్దానాల్లో కనీసం ఒక్కటి కూడా మొదలు కూడా పెట్టలేదు. 4 ఏండ్లు కాలయాపన చేసి 2018 మార్చ్ చివరి బడ్జెట్ లో అసెంబ్లీ లో ఆర్ధికమంత్రి 100 కోట్లు ప్రకటించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయక మోసం చేసింది తెరాస మొత్తం పాలనలో ఎన్నారై లకు చేసింది శూన్యం.
కెసిఆర్ నే అనేకసార్లు తన కొడుకు, బిడ్డ అమెరికాలో పని చేసుకుంటూ బతుకుతున్నారని అన్నారు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి రామారావు ఇక్కడ ఉద్యమం జరుగుతుంటే అమెరికాలో పాత్రలు కడిగేవారని అన్నారు . కష్ట పడి పని చేస్తే పనికి గౌరవం అంటారు గానీ తండ్రి ఉద్యమం పేరుతో సంపాదించి అమెరికా పంపితే తిని పాత్రలు కడిగే వారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెరాస ఓటమి పొందటం ఖాయం. ఆ తర్వాత అమెరికా వెళ్లి అందరూ ఎన్నారై ల వలే కష్ట పడి గౌరవంగా పని చేసుకుంటే డిష్ వాషర్ బహుమతి ఇస్తాం.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుధాకర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...
కెసిఆర్ మద్యం మత్తులో మతి తప్పి తీసుకున్న నిర్ణయమే ముందస్తు ఎన్నికలు. స్వార్ధ రాజకీయాలకోసం ప్రజల మీద బలవంతం భారాన్ని మోపుతున్నారు. మంత్రి మండలి సమిష్టి తీసుకోవాలిసిన నిర్ణయాన్ని 2 నిముషాల్లోనే తీసుకోవడం నియంతృత్వపోకడ. బిసి నేతలను పొమ్మనలేక పొగ బెట్టి అన్యాయం చేస్తున్నారు. ముందస్తుకు వెళ్లి తాను తీసిన గోతిలో తానే పడటం ఖాయం. తెరాస పాలన లో చెప్పుకోదగ్గ అంశమే లేదు , 2లక్షల ఇండ్లు ఇస్తామని చెప్పి విలేఖరులో ప్రశ్నలకు తిక్క సమాధానాలు చెప్పడం కెసిఆర్ కె చెల్లుతుంది.
గౌడ కులస్తులకు తెరాస చేసింది ఏమి లేదు. చీప్ లిక్కర్ ప్రవేశపెట్టి గౌడ కుటుంబాల్లో అలజడి సృష్టించారు. ఉద్యమం లో నీ కుటుంబం కంటే ఎక్కువ శ్రమ పడ్డ స్వామి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ లకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు.
నారాయణ పేట బాలకృష్ణ రెడ్డి - కో కన్వీనర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
పాలమూరు వలసలు పెరిగింది తెరాస పాలనలోనే. ఫలము ఎత్తిపోతల పథకం
పై మాటలు కోతలు దాటాయి. తట్ట మట్టి కూడా ఎత్తలేదని ఏ మొకం పెట్టుకొని ఓట్లు అడుగుతారు .
హైదరాబాద్ బల్దియా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. హైదరాబాద్ చుట్టూ 4 దిక్కులా 4 ఆస్పత్రి లు కడతామని చెప్పి మోసం చేసారు. మండలానికి ఒక 100 పడకల ఆస్పత్రి ఏమైంది.
ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేయకుండా మాటలతో మభ్య పెట్టినట్లు ప్రజలు గ్రహించారుయ రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు.
బొలిశెట్టి దశరద్ కో కన్వీనర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 600 మంది చనిపోతే ఒక్కరికి కూడా ఎక్సగ్రేషియా ప్రకటించలేదు
ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చక 2016 జులై లో ఎన్నారై మంత్రి ముసాయిదా బిల్లు సమావేశం 2018 మార్చ్ లో ముఖ్యమంత్రి ప్రవాసుల సమావేశం లో 2 రోజుల్లో ఎన్నారై పాలసీ అమలు అంటూ నమ్మించి మోసం చేశారు.
మొత్తం తెరాస పాలన లో ఎన్నారై లకు చేసింది శూ న్యం.