తెలంగాణ లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని టిపిసిసి ఎన్నారై సెల్ ఆరోపించింది. అసలు సచివాలయానికి రాకుండా పాలన సాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆరే నని ఎద్దేవా చేశారు. లోక్ షభ ఎన్నికల్లో 17 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే కేసీఆర్ ప్రజా వ్యతిరేకతలను గుర్తించయినా సచివాలయానికి వస్తారని టిపిసిసి కో కన్వినర్ సుధాకర్ గౌడ్ సూచించారు.
తెలంగాణ లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని టిపిసిసి ఎన్నారై సెల్ ఆరోపించింది. అసలు సచివాలయానికి రాకుండా పాలన సాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆరే నని ఎద్దేవా చేశారు. లోక్ షభ ఎన్నికల్లో 17 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే కేసీఆర్ ప్రజా వ్యతిరేకతలను గుర్తించయినా సచివాలయానికి వస్తారని టిపిసిసి కో కన్వినర్ సుధాకర్ గౌడ్ సూచించారు.
ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో సోమవారం టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యం లో తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో ఎన్నారై నాయకులు పాల్గొని ప్రసంగించారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ...టీఆర్ఎస్ కి ఓటేయడం వల్ల తెలంగాకి ఒరిగేది ఏమిలేదన్నారు. ఇప్పుడే టీఆర్ఎస్ కు 15మంది ఎంపీల బలముందని...దీంతో ఏం సాసాధించారని ప్రశ్నించారు. ఒక్క విభజన హామీ అయినా నెరవేర్చలేదని తెలిపారు . అందువల్ల రాష్ట్రంలోని 17 సీట్లు కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించి తెలంగాణ ఇచ్చిన ,తెచ్చిన కాంగ్రెస్‌కి కృతజ్ఞత తెలపాలని కోరారు.
undefined
టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ... తెరాసలో మొదటి నుండి ఉండి అహర్నిశలు పని చేసిన హరీష్ రావు గొంతు కోసే విధంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. మాయమాటలు ,మోసపూరిత వాగ్దానాలను ఈసారి ప్రజలు నమ్మరని అన్నారు. కెసిఆర్, మీరు హరీష్ రావు కి ద్రోహం చేశారా ? హరీష్ రావు మీకు ద్రోహం చేశారా ? ప్రజలకు తెలపాలని ఆక్ష్న డిమాండ్ చేశారు.
రెండోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా టీఆర్ఎస్ రాష్ట్రంలో ఏ ఒక్క పని మొదలు పెట్టలేదన్నారు. ఆయన ఎంత సేపూ తన కొడుకు చుట్టూ రాజకీయాలు తిప్పుతున్నారని అడ్వైసరి మెంబెర్ ప్రవీణ్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కో కన్వీనర్ రాకేష్ బిక్కుమండ్ల మాట్లాడుతూ... పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీకి చేందిన ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
ఈ లోక్ సభ ఎన్నికల జాతీయ పార్టీలయిన కాంగ్రెస్ ,బీజేపీ మధ్యేనని...టీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలకు ఓటు వేస్తే అది వృదా అవుతుందన్నారు. తెలంగాణలో బీజేపీని ఎవరు నమ్మే పరిస్థితులు లేవు కాబట్టి కాంగ్రెస్ కు ఓటేయాలని కో కన్వీనర్ శ్రీధర్ మంగళారపు సూచించారు. అలాగే ఈ ఎన్నికల్లో బ్రిటన్ ఎన్నారైలు క్రియాశీలంగా పని చేస్తున్నారని కార్యదర్శి శ్రీధర్ నీలా తెలిపారు. వరంగల్ వాసినైన తానే వరంగల్ తో పాటు మహబూబాబాద్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కృషి చేస్తానని అన్నారు.
మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మేరీ మాట్లాడుతూ... స్వతంత్ర ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు కాంగ్రెస్ శ్రమ ఎంతో ఉందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే దళిత,మైనారిటీ మహిళలకి రక్షణ ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ విభాగం కార్యవర్గ సభ్యులు దేవులపల్లి శ్రీనివాస్, నీల శ్రీధర్, మేరీ, రజిత ,శశి, అఖిల్, వేణుగోపాల్, సుభాష్, తిరుపతి రెడ్డి, గంప వేణుగోపాల్, సుధాకర్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, రాకేష్, శ్రీధర్ మంగళారపు,స్నేహలత, వైష్ణవి, రంజిత్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.