గల్ఫ్ కార్మికులతో ఉత్తమ్ సమావేశం... వరాల జల్లు

By Arun Kumar PFirst Published Nov 10, 2018, 7:05 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విదేశాల్లోని ఎన్నారైలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం దుబాయ్ కు వెళ్లిన టిపిసిసి చీఫ్ ఉత్తమ్ అక్కడి కార్మిక సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. గల్ప్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సమస్య గురించి తెలుసుకున్న ఉత్తమ్ వారికోసం పలె హామీలు ప్రకటించారు. 
 
మహాకూటమి అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రూ.500 కోట్ల నిధులతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ఉత్తమ్ ప్రకటించారు. అలాగే గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు  చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడి కార్మికుల్లో నైపుణ్యం పెంచేందుకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తమ్ హామీ ఇచ్చారు. 

 ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అవార్డ్ గ్రహీత పాటుకూరి బసంత్ రెడ్డి గారు మాట్లాడుతూ... కేవలం తన సేవలను గుర్తించి మాత్రమే ప్రభుత్వం తనకు అవార్డ్ని    అందించిందన్నారు. కానీ గల్ఫ్ కార్మికుల కష్టాలు తీర్చడంలో విఫలమైందని ఆరోపించారు. గల్ప్ కార్మికుల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వ విపలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలతో ఆకర్షితుడినై కాంగ్రెస్ పార్టీ లో చేరినట్లు తెలిపారు.

 దుబాయ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, జగిత్యాల తాజా మాజీ ఎంఎల్ఏ జీవన్ రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, టీపీసీసీ అధికార ప్రతినిధి నంగి దేవేందర్ రెడ్డి, ఎన్నారై ఇంచార్జి వినోద్ తదితరులు పాల్గొన్నారు.

click me!