అమెరికా అసెంబ్లీలో తెలంగాణ పద్మ

By ramya neerukondaFirst Published Nov 9, 2018, 11:37 AM IST
Highlights

అమెరికాలో  ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇండో-అమెరికన్లు సత్తా చాటారు. వారిలో తెలంగాణతో కాస్త సంబంధం ఉన్న పద్మ అనే మహిళ కూడా ఉన్నారు.


అమెరికాలో  ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇండో-అమెరికన్లు సత్తా చాటారు. వారిలో తెలంగాణతో కాస్త సంబంధం ఉన్న పద్మ అనే మహిళ కూడా ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన పద్మ మిచిగాన్ రాష్ట్రంలో విజయం సాధించారు. 1965 అక్టోబర్ 8న భిలాయ్ లో ఓ హిందూ సంప్రదాయ కుటుంబంలో పద్మ పుట్టి పెరిగారు.

మైసూరులో కొంతకాలం పెరిగిన పద్మ,... ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అమెరికా తూర్పు తీరంలోని స్టోనీబ్రూక్, న్యూయార్క్ నగరాల్లో పెరిగారు. అనంతరం 15ఏళ్ల వయసులో తిరిగి భారత్ వచ్చారు. వరంగల్ లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత మళ్లీ అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. కాగా.. ఇప్పుడు అమెరికా మద్యంతర ఎన్నికల్లో తన సత్తా చాటుకున్నారు.

పద్మతోపాటు మరొకొందరు ఇండో అమెరికన్లు కూడా సత్తా చాటారు. నీమా కులకర్ణి, మజ్ తబా మొహమ్మద్, రామ్ విల్లివాలమ్, అమీష్ షా, కెవిన్ థామస్ లు వీరంతా తొలిసారిగా ఎన్నికయ్యారు. వీరంతా కూడా డెమెక్రటిక్ పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీచేసిన జోష్ కౌల్.. రిపబ్లిక్ అభ్యర్థి బ్రాడ్ షీమెల్ ను ఓడించి.. రాష్ట్ర అటార్నీ జనరల్ గా విజయం సాధించిన రెండో ఇండో- అమెరికన్ గా గుర్తింపు పొందారు. 

click me!