అమెరికాలో కారు ప్రమాదం.. నల్గొండకు చెందిన విద్యార్థి దుర్మరణం..

By SumaBala Bukka  |  First Published May 11, 2022, 11:51 AM IST

అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. కారు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. 7వ తేదీన జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


నల్గొండ : americaలో జరిగిన road accidenttలో తెలుగు విద్యార్థి క్రాంతి కిరణ్ రెడ్డి దుర్మరణం చెందాడు. మిస్సోరి రాష్ట్రం వారెన్స్‌బగ్‌లో ఈనెల 7వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. telugu student బంధువులు తెలిపిన వివరాల ప్రకారం…  నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,  అరుణ దంపతుల చిన్న కుమారుడు Kranti Kiran Reddy (25) ఎంఎస్ చదివేందుకు గత ఏడాది లోని మిస్సోరీ  సెంట్రల్ యూనివర్సిటీ కి వెళ్ళాడు. ఈనెల 7వ తేదీన రాత్రి ఏడున్నర గంటలకు స్నేహితులతో కలిసి వెడుతుండగా వీరి కారును ఓ కంటైనర్‌ ఢీకొట్టింది.

డ్రైవర్ పక్కనే కూర్చున్న కిరణ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు మిగిలిన ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమెరికాలోనే ఉంటున్న శ్రీనివాస్ రెడ్డి బావమరిది మంగళవారం సమాచారం ఇవ్వడంతో విషయం తెలిసింది. క్రాంతి కిరణ్ రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి రెండు, మూడు రోజుల్లో తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు  బంధువులు తెలిపారు.

Latest Videos

ఇదిలా ఉండగా, జర్మనీలో నీటిలో తప్పిపోయిన కడారి అఖిల్ కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. వరంగల్ నగరం కరీమాబాద్ లోని మధ్య తరగతి కుటుంబం కడారి పరశు రాములు, అన్నమ్మల కొడుకైన అఖిల్ ఉన్నత చదువుల కోసం  జర్మనీకి వెళ్ళాడు. గత కొద్దికాలంగా అక్కడే సెటిల్ అయ్యారు. అయితే, 5 రోజుల క్రితం జర్మనీలోనే అఫీస్ పనిపై వెళ్లి నీటిలో మిస్ అయ్యాడు. ఆయన వెంట ఉన్న మిత్రులు ఈ విషయాన్ని ధృవీకరించారు. 

ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. దేశం కాని దేశం కావడంతో సమాచారం సరిగా లేదు. దీంతో కరీమాబాద్ లోని అఖిల్ అమ్మా, నాన్న లు ఆందోళనతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాగా, విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బుధవారం ఉదయం వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించారు. పరిస్థితిని తెలుసుకున్నారు. తను సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి తగు సహాయక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వాళ్ళను ఓదార్చారు. మంత్రి వెంట వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఆ కాలనీ వాసులు ఉన్నారు.

click me!