అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మృతి..

Published : Oct 26, 2022, 09:45 AM ISTUpdated : Oct 26, 2022, 05:04 PM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మృతి..

సారాంశం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. 

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. మరణించిన ముగ్గురిని తెలుగు రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో తెలంగాణలోని వరంగల్‌కు చెందిన పావని, ‌హైదరాబాద్‌కు చెందిన ప్రేమ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లా కడియపులంక గ్రామానికి  చెందిన సాయి నరసింహ ఉన్నారు.

వివరాలు.. మసాచుసెట్స్‌లోని షెఫ్‌ఫీల్డ్‌లో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 5.30 గంటల సమయంలో మినీ వ్యాన్, పికప్ ట్రక్కు ఢీకొన్నాయి. రూట్ 7లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారని.. ఐదుగురు గాయాలతో ఆసుపత్రిలో చేరినట్టుగా అక్కడి అధికారులు వెల్లడించారు. 

మినీవ్యాన్‌లో డ్రైవర్‌తో సహా ఏడుగురు ఉన్నారుని అధికారులు చెప్పారు. పికప్ ట్రక్కులో ప్రయాణికులు లేరని పేర్కొన్నారు. మినీ వ్యాన్, పికప్ ట్రక్‌లకు చెందిన ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. వీరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా చెప్పారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్టుగా స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత రూట్‌ 7లోని ఒక విభాగాన్ని రెండు దిశలలో మూసివేసినట్టుగా అధికారులు వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..