ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై దాడి, పరిస్థితి విషమం.. రేస్ అటాక్ అంటున్న తల్లిదండ్రులు..

By SumaBala Bukka  |  First Published Oct 14, 2022, 10:49 AM IST

పీహెచ్ డీ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్లిన విద్యార్థిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పదకొండుసార్లు పొడవడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. 


ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి వెళ్లిన ఓ విద్యార్థి కత్తిపోట్లకు గురయ్యాడు. విషమపరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇది రేసిజంతో జరిగిన దాడిగా తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెడితే.. శుభమ్ గార్గ్ (28) ఆస్ట్రేలియా సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చదువుతున్నాడు. ఈ భారతీయ విద్యార్థిపై అక్టోబర్ 6న దుండగులు కత్తితో దారుణంగా దాడి చేసి 11 సార్లు పొడిచారు. 

ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని అతని కుటుంబ సభ్యులు గురువారం తెలిపారు. ఆగ్రాకు చెందిన తాము కొడుకు దగ్గరికి వెళ్లేందుకు గత ఏడు రోజులుగా ఆస్ట్రేలియా వీసా కోసం ప్రయత్నిస్తున్నామని, కానీ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శుభమ్ గార్గ్ ఐఐటీ మద్రాస్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తి చేసి సెప్టెంబర్ 1న ఆస్ట్రేలియా వెళ్లాడు.

Latest Videos

undefined

తాగుబోతును రెండుసార్లు కరిచిన పాము.. చివరికి అదే చచ్చింది.. !!

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, శుభం ముఖం, ఛాతీ మరియు పొత్తికడుపుపై ​​అనేక గాయాలయ్యాయి. ఈ నేరానికి సంబంధించి 27 ఏళ్ల అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని మీద "హత్యాయత్నం" కింద అభియోగాలు మోపారు.
బాధితుడి తండ్రి రామ్నివాస్ గార్గ్ మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో ఉన్న శుభమ్ స్నేహితులు దీని గురించి చెబుతూ.. దాడిచేసిన వ్యక్తి ఎవరో తమకు కానీ, శుభమ్ కు కానీ తెలియదని ధృవీకరించారని అన్నారు.

"ఇది జాతి విద్వేషపూరిత దాడిగా కనిపిస్తోంది. మాకు సహాయం చేయవలసిందిగా భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం" అన్నారు. దీనిమీద ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ నవనీత్ చాహల్ మాట్లాడుతూ, "బాధితుడి సోదరుడి వీసా దరఖాస్తు ప్రక్రియలో ఉంది.  MEAతో సమన్వయం చేస్తున్నాం.  సిడ్నీలోని ఎంబసీ అధికారులతో కూడా మాట్లాడాను. వీసా త్వరలో అందుబాటులోకి వస్తుంది" అని చెప్పారు. 

click me!