జలపాతంలో పడి అమెరికాలో తెలుగు టెక్కీ మృతి

Published : Jul 06, 2019, 10:09 PM IST
జలపాతంలో పడి అమెరికాలో తెలుగు టెక్కీ మృతి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్నారై నూనె సురేష్ అమెరికాలో ప్రమాదవశాత్తు మరణించారు. కుటుంబం సమేతంగా హాలిడే ట్రిప్ కు వెళ్లి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మరణించాడు.

డల్లాస్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్నారై నూనె సురేష్ అమెరికాలో ప్రమాదవశాత్తు మరణించారు. కుటుంబం సమేతంగా హాలిడే ట్రిప్ కు వెళ్లి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మరణించాడు. సురేష్, భార్య. ఇద్దరు పిల్లలు అమెరికాలోని డల్లాస్‌లో స్థిరపడ్డారు. 

సురేష్ డల్లాస్‌లోని సింటెల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు కుటుంబసభ్యుల ప్రయత్నం చేస్తున్నారు. అయితే మృతదేహం తరలింపునకు దాదాపుగా 80 వేల డాలర్లు అవసరం అవుతాయని. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. 

ఇప్పటికే ఫండ్ రైజింగ్ వెబ్‌సైట్‌లో అమెరికా లో స్థిరపడ్డ తెలుగు వారు, తెలుగు సంఘాలు తమకు తోచిన సహాయం అందజేస్తున్నాయి. వీలైనంత తొందరగా సురేష్ మృతదేహాన్ని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..