అమెరికాలో తెలుగు వైద్యుడు అనుమానాస్పద మృతి

Siva Kodati |  
Published : Mar 29, 2019, 09:29 AM IST
అమెరికాలో తెలుగు వైద్యుడు అనుమానాస్పద మృతి

సారాంశం

అమెరికాలో తెలుగు వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. న్యూజెర్సీ సమీపంలోని ఎడిషన్‌లో ఉంటున్న మణిదీప్ అనే వ్యక్తి గురువారం మరణించాడు. 

అమెరికాలో తెలుగు వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. న్యూజెర్సీ సమీపంలోని ఎడిషన్‌లో ఉంటున్న మణిదీప్ అనే వ్యక్తి గురువారం మరణించాడు. మృతుడి స్వస్థలం కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు తాలుకా గాంధీనగర్‌.

ఇతని తల్లిదండ్రులు నందిగం శ్రీనివాస్, పద్మలు. మణిదీప్ మణిపాల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి... ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఎడిషన్‌లోని సెంట్ పీటర్స్ టీచింగ్ హాస్పిటల్‌లో పీజీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.

ఈ క్రమంలో గురువారం అతను అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు స్థానికంగా ఉన్న బంధువులు మణిదీప్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..