తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో బోనాల పండుగ

By Siva Kodati  |  First Published Jul 8, 2019, 2:11 PM IST

తెలంగాణ ఎన్నారై ఫోరం లండన్‌లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించింది. ఈ సంబరాలకు బ్రిటన్‌లో స్ధిరపడిన సుమారు 600కు పైగా తెలంగాణ వాసులు హాజరయ్యారు.


తెలంగాణ ఎన్నారై ఫోరం లండన్‌లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించింది. ఈ సంబరాలకు బ్రిటన్‌లో స్ధిరపడిన సుమారు 600కు పైగా తెలంగాణ వాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి ప్రచారంలో తెలుగువారు మొదటిస్థానంలో ఉన్నారని తెలిపారు.

గత ఎనిమిదేళ్లుగా తాను బోనాల వేడుకల్లో పాల్గొంటున్నానని తెలిపారు. మరో ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. ఇంగ్లాండ్‌ గడ్డపై తన నియోజకవర్గంలో బోనాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

Latest Videos

undefined

తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపకుడు గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో మొట్టమొదటిసారి బోనాలు నిర్వహించానని తెలిపారు.

ఆ సంస్ధ ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ.. మన ఆచారాల్ని, సంప్రాదాయాల్ని ప్రచారం చేసే బాధ్యతతో తమ సంస్థ పనిచేస్తుందని.. సంస్థ నియమాల మేరకు కలిసి వచ్చే అందరితో పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.

అనంతరం  సాంస్కృతిక కార్యక్రమాలు ,భరత నాట్యం ,గీతాలాపన ,నృత్యాలు ,చిన్నారుల చేత  నాట్య ప్రదర్శన , ఆధ్యాత్మిక ప్రవచనాలతో  కార్యక్రమం  సాగింది . తెలంగాణ వంటకాలు ,శాఖాహార మాంసా హార  భోజనం ఏర్పాటు చేశారు 

సంస్కృతి ప్రచారం లో భాగస్వామ్యమయి బోనాలు నిర్వహించిన , వివిధ సాంస్కృతిక ప్రదర్శన లు చేసిన వారికి బహుమతి లు అందచేశారు .ప్రతిష్టాత్మక  ఆచార్య జయశంకర్ సేవ అవార్డు   కి ఎన్నికైన వారికి అవార్డు అందజేత చేసారు.

సేవా రంగం లో  విశిష్ట పురష్కారాన్ని లండన్ ఎంపీ  శ్రీ వీరేంద్ర శర్మ వారికి ,పురష్కారం అవార్డు ని  శ్రీ దేవరశెట్టి శంకర్ కి   ఫౌండర్ గంప వేణుగోపాల్ ,ప్రధాన కార్యదర్శి  సుధాకర్ గౌడ్ ,ఉపాధ్యక్షులు   రంగు వెంకట్ ,ప్రవీణ్ రెడ్డి ,కార్యదర్శి శ్రీమతి మీనాక్షి అంతరి ఆధ్వర్యం లో  అందజేశారు .

click me!