ఘనంగా తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ దసరా, బతుకమ్మ వర్చువల్ సంబరాలు

By Siva Kodati  |  First Published Oct 30, 2020, 9:57 PM IST

తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ ఆదివారం నాలుగు గంటల నాన్ -స్టాప్ తెలంగాణా ధూమ్ ధామ్ వర్చువల్ ప్రోగ్రాం (ఇండియా నుండి) నిర్వహించింది. టీడీఎఫ్ ఛైర్‌పర్సన్ రామ్ కాకులవరం, ప్రెసిడెంట్ కవిత చల్లా స్వాగత పలుకులతో  కార్యక్రమం ప్రారంభం అయ్యింది. 


తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ ఆదివారం నాలుగు గంటల నాన్ -స్టాప్ తెలంగాణా ధూమ్ ధామ్ వర్చువల్ ప్రోగ్రాం (ఇండియా నుండి) నిర్వహించింది. టీడీఎఫ్ ఛైర్‌పర్సన్ రామ్ కాకులవరం, ప్రెసిడెంట్ కవిత చల్లా స్వాగత పలుకులతో  కార్యక్రమం ప్రారంభం అయ్యింది.  

తరువాత ప్రత్యేకంగా చేసిన టీడీఎఫ్ బతుకమ్మ పాట స్వాగత గీతం అందరినీ అలరించింది. గోరెటివెంకన్న, దేశపతి శ్రీనివాస్ రాసిన రెండు  టి.డీ.ఎఫ్ సంబరాల ఆవిష్కరణ గీతాలను అందరు గాయకులు కలసి పాడి శ్రోతలను అలరించారు. 
 
కార్యక్రమంలో మాజీ మంత్రి డి.కే అరుణ మాట్లాడుతూ.. తాను కూడా గత సంవత్సరం వాషింగ్టన్ డి.సి బతుకమ్మ సంబరాలలో పాల్గొనడం చాలా సంతోషంగా వుందన్నారు. టీడీఎఫ్ మన తెలంగాణ సంస్కృతిని రాబోయే తరాలకు అందివ్వడంలో చాలా ముందుంది.

Latest Videos

నేను కూడా అక్కడ పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా బతుకమ్మ ఆట పాటలలో పాల్గొనడం ప్రత్యక్షంగా చూసాను.  త్వరలోనే ఈ విపత్కర పరిస్థితి నుండి బయటకు వచ్చి మళ్ళీ అందరం ఉత్సాహంగా అన్ని పండుగలు జరుపుకునే  రోజులు రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

 


 
మాజీ ఎం.ఎల్.ఏ  పద్మావతి మాట్లాడుతూ  “గత సంవత్సరం అమెరికాలో జరిగిన టి.డి.ఎఫ్ సమావేశాల్లో పాల్గొనడం, అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మళ్ళీ తనను ఈ వర్చువల్ మీటింగ్‌కి పిలవడం చాలా సంతోషంగా వుందని చెప్పారు.
 
ఎం.ఎల్.సి , రైతు బంధు కమిటీ చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ  తనను ఈ కార్యక్రమమానికి పిలిచి మాట్లాడమన్న నిర్వాహుకులకి ధన్యవాదాలు తెలిపారు. రైతులకి - రైతు బంధు , రైతు భీమా, రైతు కళ్లాలు ఇలా ఎన్న  పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆయన గుర్తుచేశారు. చాలా గ్రామాల్లో నర్సరీలు , వైకుంఠధామాలను ఈ ప్రభుత్వం ప్రారంభించింది, తాగునీరు సాగునీరు కూడా ప్రజలకు అందిస్తుందని పల్లా చెప్పారు.
 
ఎం.ఎల్.ఏ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ  “తెలంగాణ మలిదశ ఉద్యమంలో టీడీఎఫ్ కి ఒక ప్రత్యేక  స్థానం ఉంది. తీరొక్కపువ్వుని తీసుకొచ్చి బతుకమ్మ పేర్చినట్టు,  టీడీఎఫ్ కూడా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలంగాణ కళాకారులని, మేధావులని, ఉద్యమకారులని ఒక్క త్రాటిపైకి తెచ్చి తెలంగాణ సంసృతిని ఎలుగెత్తి చాటి తెలంగాణ నినాదాన్ని విశ్వవ్యాప్తి చేయడంలో టిడిఎఫ్ పాత్ర ఎంతో ఉంది.

అనేక కొత్త సంస్థ లొచ్చినప్పటికీ టీడీఎఫ్ తన ఉనికిని ఎప్పుడూ చాటుకుంటేనే ఉంది. ఈ కరోనా ఇబ్బందులు లేనట్టయితే , టి.డీఎఫ్ ఈ బతుకమ్మ, దసరా సంబరాలను ఘనంగా చేస్తూ తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

టిడిఎఫ్ కార్యవర్గం  తెలంగాణ  సంస్కృతి పట్ల పడుతున్న శ్రమ, ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నంగా భావించుకుంటూ తనకు టీడీఎఫ్ ఒక మాతృ సంస్థ లాంటిది అని అన్నారు. ఎందరో తెలంగాణ కళాకారులని అమెరికాకు తీసుకువచ్చిన ఘనత టీడీఎఫ్‌కే చెందింది” అన్నారు . 
 
టి.డి.ఎఫ్ మాజీ అధ్యక్షుడ లక్ష్మణ్ అనుగు మాట్లాడుతూ టీడీఎఫ్, తెలంగాణ మలి దశ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నదని, ఉత్సాహంగా పనిచేసే ఎందరో కార్యకర్తల సమాహారమే టి.డి.ఎఫ్ అని అన్నారు.  

టి.డీ.ఎఫ్ మాజీ  చైర్మైన్, ఫౌండర్  గోపాల్ రెడ్డి గాదె మాట్లాడుతూ ‘‘ టి.డి.ఎఫ్ ప్రారంభించిన రోజుల్లో తెలంగాణ అంటే చాలామంది తెలంగాణా ఎన్నారైల్లో ఎలాంటి ఉత్సాహం ఉండేది కాదు. అందుకనే మేము మన ప్రత్యేక తెలంగాణా సంస్కృతికి, గుర్తింపుని ఎన్నారైలకి పరిచయం చేయాలనుకున్నాం.  

మధుసూదన్ లాంటి ఎందరో మిత్రుల సహకారంతో తెలంగాణ పిక్నిక్ లని ప్రారంభించాము ప్రతి స్టేట్లో. మన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చి చూసిన కవిత కల్వకుంట ఆ తర్వాత బతుకమ్మని జాగృతి పేరుతో జరపడం కూడా టి.డి.ఎఫ్ వల్లనే ’’ అన్నారు .

ఇరవై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన టీడీఎఫ్ ఇప్పుడు అటు ఇండియాలో ఇటు అమెరికాలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంది అని గర్వంగా చెప్పుకోవచ్చు. అందరికీ మరొక్క సారి దసరా బతుకమ్మ శుభాకాంక్షలు”  అన్నారు.
 
ప్రెసిడెంట్ కవిత చల్లా మాట్లాడుతూ “టి.డి.ఎఫ్  ఇరవైసంవత్సరాల క్రితం తెలంగాణా అభివృద్ధి ధ్యేయంగా జయశంకర్ సార్, జనార్దన్ రావు చేతుల మీదుగా అమెరికాలో ప్రారంభించిన సంస్థ.  ఆ తర్వాత ఉవ్వెత్తున లేచిన మలిదశ  ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో చురుకుగా పాల్గొంది టి.డి.ఎఫ్.

తెలంగాణ సంస్కృతి కి ప్రతిబింబమయిన అతిపెద్ద పండుగ బతుకమ్మని  ప్రపంచానికి పరిచయం చేస్తూ, ఈ పండుగ టి.డి.ఎఫ్ తన సిగ్నిచర్ కార్యక్రమంలా టి.డి.ఎఫ్ లో అంతర్భాగం అయ్యింది. అటు ఇండియాలో, ఇటు అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో టి.డి.ఎఫ్ తన కార్యక్రమాలను, అభివృద్ధి పనులని అమలుచేస్తుంది.

ప్రతీ సంవత్సరం ఘనంగా జరుపుకునే  ఈ పండుగను, మనం చాలా గౌరవంగా భావించే గౌరమ్మని ప్రతీసారీ కొలిచినట్టే. ఈ కరోనా విపత్కర పరిస్థితిలో కూడా ఆన్‌లైన్‌ పద్దతిలో సాంప్రదాయాన్నికొనసాగించడానికి టి.డి.ఎఫ్ సిద్ధపడింది.

బతుకమ్మ మహమ్మారి నుండి రక్షించి అతి త్వరలో ఇంతకు ముందులాగా అందరం, సంతోషంగా పండుగలు జరుపుకునే రోజురావాలని ఆశిస్తున్నాను. ఈసారి టీడీఎఫ్ ప్రత్యేక బతుకమ్మ పాటని కూడా  రూపొందించింది.

ఈ పాటకు సహకరించిన వారికి మరియు కళాకారులు ప్రత్యక్షంగా వచ్చి తమ ఆటపాటలతో  మనందరినీ అలరిస్తున్నారు, అందుకు సహకరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదములు.

అడగగానే ఆన్‌లైన్‌లోకి వచ్చి తమ అమూల్య సందేశాన్ని బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియచేసిన ప్రజాపతినిధులకి పేరుపేరునా ధన్యవాదములు.  అన్ని సిటీ చాఫ్టర్స్ చేసిన బతుకమ్మ పండుగ విశేషాలని  వీడియోల రూపంలో  మీకు ప్రదర్శిస్తున్నాము. 

బాపు రెడ్డి కేతిరెడ్డి బోర్డు అఫ్ ట్రస్టీ, మన తెలంగాణ  బడి ప్రొజెర్సీటీ  ఛైర్‌పర్సన్ అట్లాంటా నుంచి మాట్లాడుతూ తాను, టీమ్ అందరూ స్కూల్ చేయిత కార్యక్రమాలు గురించి చెప్పారు.  

ప్రీతి చల్లా, బోర్డు అఫ్ ట్రస్టీ, టీడీఫ్ , జాయింట్ ట్రెజరీ, జై కిసాన్ రైతుల ప్రాజెక్ట్‌కి ఛైర్‌పర్సన్ చికాగో నుంచి మాట్లాడుతూ తాను మరియు టీం అందరూ రైతు సంక్షేమ చేయిత కార్యక్రమాలు గురుంచి వివరించారు

జైకిసాన్, మనబడి , వలసదారులకి, వికలాంగులకి, పూజరులకు సహకరిస్తున్నాము, దానికి సహాయం చేస్తున్న టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ వట్టే రాజా రెడ్డి, కార్యదర్శి మట్టా రాజేశ్వర్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 

వృత్తిరీత్యా డాక్టర్ అయిన దివేష్ అన్నిరెడ్డి మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసుల్ని ఉటంకిస్తూ కరోనా సెకండ్ వేవ్ వస్తుందని ఇంకా కొన్ని రోజులు జాగ్రతగా ఉండాలని, అతి త్వరలో వాక్సిన్ వస్తుందని అన్నారు . డాక్టర్ దివేశ్ తన సొంత గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.

ప్రవీణ్ సింగిరికొండ, టీడీఎఫ్  బోర్డ్ అఫ్ ట్రస్టీ సెయింట్ లూయిస్ చాప్టర్ కార్యక్రమాలు గురించి వివరించారు. శ్రీని అనుమాండ్ల, టిడిఫ్ బోర్డు అఫ్ ట్రస్టీ , అండ్ పోర్ట్‌లాండ్ చాప్టర్ చైర్, టీం చేస్తున్న పలు సంస్కృతిక కార్యక్రమాలు మరియు సేవ కార్యక్రమాల గురించి విమరించారు.

తెలంగాణ, హైదరాబాద్ నగరం లోని గుంటి జంగయ్య నగర్ వరద బాధితులకు పోర్ట్‌లాండ్ చాప్టర్ టీం, పోర్ట్‌లాండ్ ఎన్ఆర్ఐల సహాయంతో నిత్యావసర వస్తువులు పంపిణి చేయడానికి సహాయం చేశారు.

 

 

మధుసూదన్ కే రెడ్డి , టీడీఫ్ అడ్వైజర్, టీడీఎఫ్ కార్యకర్త అలాగే టీడీఎఫ్ మొదటి చైర్మన్ రాంచందర్ రెడ్డి, ఈ ఆన్‌లైన్ కార్యక్రమానికి రాలేక పోయినప్పటికీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

న్యూయార్క్ తెలంగాణ అసోషియేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ గూడూరు మాట్లాడుతూ “అందరికీ పండుగ శుభాకాంక్షలు. ఎప్పుడూ ఏదో ఒక హాల్ లో కొన్ని వందల మంది మాత్రమే  జరుపుకునే కార్యక్రమం ఇప్ప్పుడు ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమాన్ని  ప్రపంచవేదికగా  జరుపుకోవడం,   చాలా అద్భుతమైన విషయం” అన్నారు.
 
సింగర్స్ మధుప్రియ, కార్తిక్ కొడకండ్ల, దండేపల్లి శ్రీనివాస్, స్వర్ణక్క, రేలా రేలా గంగ తమ ఆటపాటలతో దుమ్ము లేపారు. మిమిక్రీ రమేష్ తన మిమిక్రీ డైలాగులతోనే కాకుండా పాటలను పాడుతూ  శ్రోతల్ని అలరించారు. 
 
టీడీఎఫ్ అధ్యక్షులు కవిత చల్ల ధన్యవాదములు చెపుతూ “ ఈ విర్చువల్ తెలంగాణ సంబరాలను విజయవంతం చేయడంలో ఏ.బి.ఆర్ ఛానెల్ నిర్వహకుల కృషి ఎంతో ఉందని వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  

మన తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేసి, ఎన్నో కొత్త ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశాన్ని పురోగమనం వైపు మళ్లించిన మన తెలుగు ముద్దుబిడ్డ , మాజీ ప్రధాని పీ.వీ.నరసింహ్మారావుకి భారతరత్నఇవ్వాలని కోరుతున్న అనేక తెలుగు సంఘాల డిమాండుతో ఏకీభవిస్తూ, అనేక ఇతర ఎన్నారై సంఘాల నేతృత్వంతో , టి.డి.ఎఫ్ తరపున కూడా పీ.వీ.నరసింహ్మారావు గారికి భారతరత్న ఇవ్వాలని” కేంద్ర ప్రభుత్వాన్నికోరారు కవిత చల్ల.

టిడిఎఫ్ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న సహకరిస్తున్న మీడియా మిత్రులు ఏబీఆర్ టీవీ, మన టీవీ, టీవీ5, పిలుపుటివీ, తెలుగు టైమ్స్, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, జీఎన్ఎన్ టీవీ, ఎన్ఆర్ఐ స్ట్రీమ్స్, టోరీ రేడియోతో పాటు గతంలో సహకరించిన టీవీ9, వీ6, టీవీ ఏషియా, యోయో టీవీ, సాక్షి తదితర సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
 
చివరగా టీడీఎఫ్ ఛైర్‌పర్సన్ రామ్ కాకులవరం, మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ అనుగు, టీడీఫ్ ఎగ్జిక్యూటివ్ టీం కు, బోర్డు అఫ్ ట్రస్టీస్ కు, సిటీ చాప్టర్ కోఆర్డినేటర్స్ కు, బతుకమ్మ లేడీస్ టీమ్స్ కు అన్ని  సిటీస్ నుంచి ఈ కార్యక్రమం లో పాల్గొని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
 

click me!