నిండు గర్బిణీని.. సాయం చేసేవారు లేరు, ఆదుకోండి: సుప్రీంలో ఎన్ఆర్ఐ పిటిషన్

By Siva KodatiFirst Published Apr 22, 2020, 4:53 PM IST
Highlights

కరోనా వైరస్ కారణంగా విద్య, ఉపాధి అవకాశాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు కోవిడ్ 19తో మరణించగా.. మరికొందరు ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. 

కరోనా వైరస్ కారణంగా విద్య, ఉపాధి అవకాశాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు కోవిడ్ 19తో మరణించగా.. మరికొందరు ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు.

అయితే లాక్‌డౌన్ కారణంగా పలువురు భారతదేశానికి తిరిగి రావడానికి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తనను  ఎలాగైనా స్వదేవానికి పంపించాలంటూ దుబాయ్‌లో స్థిరపడిన ఓ భారతీయ గర్బిణీ మహిళ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కేరళలోని కోజి‌కోడ్‌కు చెందిన అతిరా గీతా శ్రీధరన్‌ దుబాయ్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఆ దేశంలో విధించిన లాక్‌డౌన్‌లో ఈ రంగానికి మినహాయింపును ఇవ్వకపోడంతో ఆయనకు సెలవు దొరకట్లేదు.

ఇదే సమయంలో అతిరా గర్బిణీ. అక్కడ ఆమెకు సంరక్షణ బాధ్యతలు చూసేవాళ్లు ఎవరూ లేనందున తీసుకురావాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జూలైలో డెలివరీ జరగాల్సి ఉన్నందున మే మొదటి, రెండో వారాల్లో భారత్‌కు వస్తానని వాపోయింది.

కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఆమె తన స్వస్థలానికి చేరుకోవడం అత్యంత అవసరమని పిటిషన్‌లో పేర్కొంది. కాగా ఈ పిటిషన్‌పై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు.

మరోవైపు దుబాయ్‌లో నివసిస్తున్న ఇతర కార్మికులు సైతం తమను భారత్‌కు తీసుకురావాలని వేడుకుంటున్నారు. కాగా యూఏఈలో ఇప్పటి వరకు 7,755 మందికి కరోనా సోకగా.. 46 మంది మరణించారు. 

click me!