పనిమనిషిని టార్చర్ చేసి చంపిన భారత మహిళ..!

By telugu news team  |  First Published Feb 24, 2021, 9:53 AM IST

పని మనిషి.. ఆకలి తట్టుకోలేక డస్ట్ బిన్ లో ఏదైనా ఆహారం దొరుకుతుందేమోనని వెతికినందుకు కిటికీ కి కట్టేసి మరీ చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తోంది. 


భారత సంతతికి చెందిన ఓ మహిళ తన ఇంట్లో పనిచేసే పనిమినిషిని నానా రకాలుగా టార్చర్ చేసింది.కాగా... ఆమె పెట్టిన టార్చర్ తట్టుకోలేక సదరు పని మనిషి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన సింగపూర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భారత సంతతికి చెందిన గాయత్రి మురుగయన్(40) అనే మహిళ సింగపూర్ లో స్థిరపడ్డారు. ఐదు నెలల క్రితం వారి ఇంట్లో పనిచేయడానికి ఓ పనిమినిషి కుదిరింది. కాగా.. సదరు పనిమనిషిని గాయత్రి నానా రకాలుగా చిత్ర హింసలకు గురిచేశారు. సదరు పనిమినిషి శరీర బరువు కేవలం 24 కేజీలేనని అక్కడి పోలీసులు చెప్పారు. పని మనిషికి కనీసం తినడానికి తిండి కూడా పెట్టేది కాదని అక్కడి న్యూస్ మీడియా తెలియజేసింది.

Latest Videos

పని మనిషి.. ఆకలి తట్టుకోలేక డస్ట్ బిన్ లో ఏదైనా ఆహారం దొరుకుతుందేమోనని వెతికినందుకు కిటికీ కి కట్టేసి మరీ చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఆమె మెడకు తీవ్ర గాయమై.. అక్కడ రక్తం గడ్డకట్టి ప్రాణాలు కోల్పోయింది.

కాగా.. పనిమినిషి ని చిత్ర హింసలకు గురిచేసినందుకు గానే.. గాయత్రికి కఠిన శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  నిందితురాలికి జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేరపూరిత నర హత్య, ఆకలితో బాధించడం, వేధించడం లాంటి దాదాపు 28 ఆరోపణలు ఆమె పై నమోదు చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

click me!