రైతుల ఆందోళన: కెనడాలో ఎన్ఆర్ఐల కారు ర్యాలీ

By Siva Kodati  |  First Published Jan 26, 2021, 4:14 PM IST

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిపబ్లిక్ డేని పురస్కరించుకుని రాజధానిలో ట్రాక్టర్ల ర్యాలీకి పిలుపునిచ్చారు. 


కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిపబ్లిక్ డేని పురస్కరించుకుని రాజధానిలో ట్రాక్టర్ల ర్యాలీకి పిలుపునిచ్చారు. ఇప్పటికే రైతులకు మద్ధతుగా భారతదేశంతో పాటు వివిధ దేశాల అధినేతలు, ప్రముఖులు, ప్రవాస భారతీయులు అండగా నిలిచారు. 

తాజాగా రైతులు చేపడుతున్న ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా కెనడాలోని ఎన్నారైలు కారు ర్యాలీ నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు(కెనడా కాలమానం ప్రకారం) బ్రాంప్టన్‌లో ఈ ర్యాలీ ప్రారంభమైంది.

Latest Videos

సాకర్ సెంటర్ నుంచి భారత పాస్‌పోర్ట్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. అలాగే కాల్గరీ నుండి ఎడ్మొంటన్ వరకు కూడా మరికొంత మంది ప్రవాస భారతీయులు మరో ర్యాలీ చేపట్టనున్నారు.

Also Read:ఎర్రకోటపై జెండా పాతిన అన్నదాతలు.. దించేసిన పోలీసులు

ఈ రెండు ర్యాలీలకు సరోకరన్ ది ఆవాజ్(అలయన్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ కెనడియన్స్), దిశా(మహిళ స్వచ్చంధ సంస్థ), జీటీఏ వెస్ట్ క్లబ్, ఇండో-కెనడియన్ వర్కర్స్ అసోసియేషన్, ప్రవాసీ పంజాబీ పెన్షనర్స్ అసోసియేషన్, సిర్జన్హరియన్(మహిళల సంఘం), కెనడియన్ పంజాబీ సాహిత్ సభ, ఎంఎల్ పార్టీ ఆఫ్ కెనడా, ప్రొఫెసర్ మోహన్ సింగ్ ఫౌండేషన్ తమ పూర్తి మద్దతు తెలిపాయి.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న శాంతియుత నిరసనలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా కాల్గరీకి చెందిన పరమజీత్ సింగ్ తెలిపారు. 
 

click me!