ఆస్ట్రేలియాలో తెలంగాణ విద్యార్థిని మృతి

Published : Jan 02, 2021, 10:09 AM IST
ఆస్ట్రేలియాలో తెలంగాణ విద్యార్థిని మృతి

సారాంశం

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత(22) అనే యువతి కొంతకాలం క్రితం ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లింది.

ఆస్ట్రేలియాలో తెలంగాణ యువతి దుర్మరణం పాలయ్యింది. ఉన్న విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లగా.. అక్కడ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.  పూర్తి వివరాల్లోకి వెళితే... నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత(22) అనే యువతి కొంతకాలం క్రితం ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లింది.

అక్కడ రక్షిత ఎంఎస్ చదువుతోంది.  అయితే.. అక్కడ ఆమె స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా.. ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రక్షిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాగా.. రక్షిత తండ్రి వెంకటరెడ్డి ఆర్మీ విశ్రాంత ఉద్యోగి కావడం గమనార్హం. కూతురు మరణవార్త విని రక్షిత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. త్వరలోనే ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చే అవకాశం ఉంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..