టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో వీటిని పొందుపర్చాలి... ఎన్నారైల వినతి

By Arun Kumar P  |  First Published Oct 2, 2018, 4:34 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో ప్రజలకు ఇవ్వాల్సిన హామీలపై ముఖ్య పార్టీలన్ని కసరత్తు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని రూపొందించడానికి కేశవరావు అధ్యక్షతన ఓ కమిటీ పనిచేస్తోంది. ఈ మేనిఫెస్టో రూపకల్పనలో తమ గురించి కూడా ఆలోచించాలంటూ ఎన్నారై తెరాస యూకే ప్రతినిధులు మేనిఫెస్టో కమిటీ చైర్మన్  కేశవరావును కలిసి వినతి పత్రం సమర్పించారు.

Latest Videos

undefined

ఈ సందర్భంగాఎన్నారై తెరాస యూకే ప్రతినిధి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... ఇప్పటికే కెసిఆర్ ప్రభుత్వం ఎన్నారైల సంక్షేమం పట్ల చాలా బాగా కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఎన్నారైల సంక్షేమానికి  ప్రభుత్వం మరింత ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తాము కోరిపట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పలు సూచనలు,సలహాలతో కూడిన నివేదిక సమర్పించామని తెలిపారు.  

ఎన్నారై తెరాస యూకే  అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి కూడా ఫోన్ ద్వారా తన సందేశాన్ని మీడియా కి తెలియజేశాడు. ఈ నివేదికను సిద్ధం చేయడానికి సహకరించిన అంతర్గత మేనిఫెస్టో కమిటీ సభ్యులు నవీన్ రెడ్డి , రవి ప్రదీప్ పులుసు, సతీష్ రెడ్డి బండ, రమేష్ ఎసెంపల్లి, సురేష్ బుడగం, రవి రేతినేని, సురేష్ గోపతి మరియు వీటిని పర్యవేక్షించిన అనిల్ కూర్మాచలం, శ్రీకాంత్ పెద్దిరాజు, రత్నాకర్ కడుదుల మరియు సిక్కా చంద్రశేఖర్ లకు ఆయన కృతజ్ఞత తెలిపారు. నివేదికలోని అంశాలని పరిశీలించి రాబోయే మానిఫెస్టోలో చేర్చాలని కేశవ రావు గారికి  విజ్ఞప్తి  చేసినట్టు తెలిపారు .

మేనిఫెస్టో కమిటీ చైర్మన్  కేశవరావును కలిసిన వారిలో ఎన్నారై తెరాస యూకే నాయకులు మధుసూదన్ రెడ్డి,  ప్రవీణ్ కుమార్, సుభాష్ కుమార్ లు ఉన్నారు.  వీరు
మంగళవారం మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవ రావు ఇంటికి వెళ్ళి  కలిసి వినతి పత్రం అందించడం జరిగింది.

click me!