బెజవాడ దుర్గమ్మకు వెండి వస్తువులు బహూకరించిన ఎన్ఆర్ఐ

Siva Kodati |  
Published : Apr 15, 2019, 08:25 AM IST
బెజవాడ దుర్గమ్మకు వెండి వస్తువులు బహూకరించిన ఎన్ఆర్ఐ

సారాంశం

బెజవాడ కనకదుర్గమ్మకు అమెరికాలో స్ధిరపడ్డ ప్రవాసాంధ్రుడు వెండి సామాగ్రి బహూకరించారు.

బెజవాడ కనకదుర్గమ్మకు అమెరికాలో స్ధిరపడ్డ ప్రవాసాంధ్రుడు వెండి సామాగ్రి బహూకరించారు. కూచిబోట్ల సూర్యప్రకాశ్, శ్రీరమణి దంపతులు ప్రతి రోజు వాడుకు నిమిత్తం 3.75 గ్రాముల బరువున్న వెండి గిన్నెలు, ప్లేట్లు, మూతలు వివిధ సైజుల్లో చేయించారు. వీటి విలువ సుమారు రూ.75 వేలు.

వీటిని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ దంపతులకు అధికారులు అమ్మవారి దర్శనం చేయించి వేదపండితులతో ఆశీర్వాదం ఇప్పించారు. అనంతరం దుర్గమ్మ చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. 

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..