బెడసికొట్టిన ‘వయాగ్రా’.. మొత్తం 3,200 మాత్రలు..!

Published : Feb 08, 2021, 08:14 AM IST
బెడసికొట్టిన ‘వయాగ్రా’.. మొత్తం 3,200 మాత్రలు..!

సారాంశం

ఆ వయాగ్రా మాత్రలను ఓ వ్యక్తి  అక్రమంగా తరలించాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో అడ్డంగా దొరికిపోయాడు. 

శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు ‘వయాగ్రా’ మాత్రలు వాడతారన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా.. ఆ వయాగ్రా మాత్రలను ఓ వ్యక్తి  అక్రమంగా తరలించాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికాలోని షికాగో విమానాశ్రయంలో ఓ భారతీయుడు అక్రమంగా వయాగ్రా మాత్రలను తరలించేందుకు ప్రయత్నించాడు. అతని వద్ద నుంచి 3,200 వయాగ్రా మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  అతంతరం అతనిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆ మాత్రల విలువ రూ.70లక్షలు(96వేల డాలర్లు) ఉంటుందని అధికారులు చెప్పారు.

ఇటీవల భారత్ వచ్చిన ఓ ప్రయాణికుడు తిరుగు ప్రయాణంలో అమెరికా వెళుతూ తనతోపాటు తీసుకువచ్చిన అమెరికా కస్టమ్స్, సరిహద్దు భద్రత( సీబీపీ) విభాగం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేసింది. కాగా.. ఆ ప్రయాణికుడి వ్యక్తిగత వివరాలను మాత్రం బయటకు రానివ్వలేదు. 

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..