భారత్ ఉన్నట్టుండి చేతిలో తుపాకీతో చిల్డ్రన్ మెడికల్ గ్రూపు(సీఎంజీ) వైపు వెళ్లాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న కొంతమందిని బందీలుగా చేసుకున్నాడు.
అమెరికాలో భారత సంతతి పిల్లల వైద్యుడు దారుణానికి పాల్పడ్డాడు. టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ లోని మెడికల్ ఆఫీసులో ఓ మహిళా వైద్యురాలిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం అదే తుపాకీతో తనని తాను కాల్చుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...
43 ఏళ్ల భారతీయ వైద్యుడు భారత్ నరూమంచి ఇటీవల క్యాన్సర్ చికిత్స కోసం ఆస్టిన్ మెడికల్ ఆస్పత్రిలో చేరారు. అయితే, మంగళవారం భారత్ ఉన్నట్టుండి చేతిలో తుపాకీతో చిల్డ్రన్ మెడికల్ గ్రూపు(సీఎంజీ) వైపు వెళ్లాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న కొంతమందిని బందీలుగా చేసుకున్నాడు.
దీంతో భయపడిన కొందరు భారత్ నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన అతను తన చేతిలోని తుపాకీతో విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు.
దీంతో కేథరీన్ డాడ్సన్ అనే వైద్యురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇదంతా చూసిన కొందరు ఆస్టిన్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే, పోలీసులు వచ్చేలోపే అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని భారత్ చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.