మ్యాట్రిమోనీ వెబ్ సైట్ ద్వారా పరిచయం అయిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ ఎన్ఆర్ఐ అత్యాచారానికి పాల్పడ్డాడు.
మ్యాట్రిమోనీ వెబ్ సైట్ ద్వారా పరిచయం అయిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ ఎన్ఆర్ఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. రేప్ కేసులో తాజాగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పంజాబ్ రాష్ట్రం జలందర్ సింగ్ కి చెందిన రవీందర్ సింగ్ గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 2017లో రవీరంద్ సింగ్ కి యువతి.. మ్యాట్రిమోనీ వెబ్ సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది. పెళ్లి సాకుతో ఆమెను తరచూ కలిసిన రవీందర్.. ఒకరోజు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. దీంతో.. యువతి కూడా ఎలాంటి పోలీసు కేసు పెట్టింది.
undefined
కాగా.. ఘటన జరిగి నెలలు గడుస్తున్నా... పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. దీంతో.. మోసపోయానని గ్రహించిన బాధితురాలు 2018 మార్చిలో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. కాగా.. పోలీసుల దర్యాప్తులో నిందితుడికి అప్పటికే వేరే యువతితో వివాహం అయినట్లు తెలిసింది. భార్యతో కలిసి అతను యూకేలో ఉంటున్నాడు.
ఇటీవల అతను భారత్ కి రాగా.. గురువారం అతనిని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.