కన్న తండ్రి చేతిలోనే ఎన్నారై మహిళ దారుణ హత్య...

Published : Feb 25, 2019, 08:34 PM IST
కన్న తండ్రి చేతిలోనే ఎన్నారై మహిళ దారుణ హత్య...

సారాంశం

కుటుంబంతో సరదాగా గడపడానికి ఆమె విదేశాల నుండి స్వదేశానికి వచ్చింది. ఇలా వచ్చిన ఆమె కన్న తండ్రి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యింది. ఈ ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. 

కుటుంబంతో సరదాగా గడపడానికి ఆమె విదేశాల నుండి స్వదేశానికి వచ్చింది. ఇలా వచ్చిన ఆమె కన్న తండ్రి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యింది. ఈ ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. 

పంజాబ్ లోని ఆద్యాత్మిక నగరం అమృత్ సర్‌కు చెందిన నీలోఫర్(35) విదేశాల్లో స్థిరపడింది.చాలా కాలంగా అక్కడే వుంటున్న ఆమె ఇటీవలే తల్లిదండ్రుల చూడడానికి ఇండియాకు వచ్చింది.

అయితే గత ఆదివారం ఆమెను కన్న తండ్రి డేవిడ్ మనీష్ రాడ్ తో కొట్టి దారుణంగా హత్యచేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో నీలోఫర్ ను  ఇనుప రాడ్ తో కొట్టి హత్య చేసిన మనీష్ ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని ఈ హత్య, ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  
 
PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..