తెలంగాణ ప్రగతి కేవలం కెసిఆర్ నాయకత్వంలోనే సాధ్యమవుతోందని గత నాలుగు సంవత్సరాల సంక్షేమమే దానికి ఉదాహరణ అని తెలిపారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి న్యూజిలాండ్ టీఆర్ఎస్ శాఖ మద్దతు తెలిపింది. త్వరలో ఎన్నికలు రానున్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థుల జాబితాను కేసీఆర్ విడుదల చేశారు. కాగా.. ఈ విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని టీఆర్ఎస్ న్యూజిలాండ్ అధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి కోసన హర్షం వ్యక్తం తెలిపారు.
కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రతిపక్షాలకు ఒక మాష్టర్ స్ట్రోక్ లాంటిదని విజయ భాస్కర్ రెడ్డి కోసన అన్నారు. తెలంగాణ ప్రగతి కేవలం కెసిఆర్ నాయకత్వంలోనే సాధ్యమవుతోందని గత నాలుగు సంవత్సరాల సంక్షేమమే దానికి ఉదాహరణ అని తెలిపారు.
undefined
కేసీఆర్ గారి నాయకత్వ ప్రతిభతో 100 పైగా స్థానాల్లో విజయ దుందుభి టీఆర్ఎస్ మోగిస్తుందని తెలిపారు. తెరాస ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాలా గారు కూడా తమకు త్వరలో ఎన్నికల ప్రచార నిర్వహణలో అవలంభించాల్సిన పద్దతుల గురించి వివరరిస్తారని తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ న్యూజిలాండ్ శాఖ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యి ఎన్నికల ప్రచార కార్యాచరణ రూపొందించబోతున్నామని తెలిపారు .
కేసీఆర్ సైనికులుగా పని చెయ్యాలనే ఉద్దశ్యంతో టీఆర్ఎస్ న్యూజిలాండ్ హొనొరర్య్ చైర్ పర్సన్ కళ్యాణ్ రావు కాసుగంటి “జై కెసిఆర్” రిజిస్ట్రేషన్ ప్లేట్ కలిగిన ,తన స్వంత కారును తెలంగాణ ప్రగతి రథముగా , న్యూ జీలాండ్ లోని రహదారుల పైన నడుపుతూ , అధ్యక్షుడు మరియు ఇతర కమిటీ సభ్యులతో కలిసి ఇంటిటీకి ప్రచారం నిర్వహించి , తెలంగాణ బిడ్డల మద్దతు పాటు , తెలంగాణ లో నివసించే అన్ని నియోజకవర్గాల వారి కుటుంబాల, స్నేహితుల మద్దతు పొంది తెరాస పార్టీ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు.
శ్రావణ శుక్రవారం మంచి రోజు కావడం వలన ఈ ప్రచారానికి నాంది పలికామని అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కొసన తెలిపారు. అన్ని ప్రజా ఆశీర్వాద సభలను విజయవంతం కావాలని అభిలషించారు .