కరోనా ఇక్కట్లు: లండన్‌లో భారతీయులకు అండగా తెలుగు సంఘాలు

By Siva Kodati  |  First Published Mar 26, 2020, 6:33 PM IST

కరోనా వైరస్ కారణంగా దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోవిడ్ 19ని కట్టడి చేసే క్రమంలో అంతర్జాతీయ సర్వీసులను సైతం నిలిపివేశారు. దీంతో పలు దేశాల్లో లక్షలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. 


కరోనా వైరస్ కారణంగా దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోవిడ్ 19ని కట్టడి చేసే క్రమంలో అంతర్జాతీయ సర్వీసులను సైతం నిలిపివేశారు. దీంతో పలు దేశాల్లో లక్షలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. ఆదరించేవారు లేక ఏమవుతుందో తెలియక భారతీయులు బిక్కుబిక్కుమంటున్నారు.

Also read:రాజప్రాసాదంలో ఏడుగురు ఉద్యోగులకు కరోనా: క్వారంటైన్‌లోకి మలేషియా రాజు, రాణి

Latest Videos

undefined

అయితే వీరిని ఆదుకునేందుకు ఆయా దేశాల్లో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, భారతీయ సమాజం ముందుకు వస్తున్నాయి. ఉచిత వసతి, భోజనం ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలో లండన్‌ విమానాశ్రయం మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్ధులకు తెలుగు సంఘాలు ఆదుకుంటున్నాయి.

Also Read:డబ్బు సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు తిరిగిరావు: ట్రంప్ పై బిల్ గేట్స్ ఫైర్

గురువారం నుంచి ఈ నెల 31 వరకకు ఉచిత వసతి కల్పించాయి. విద్యార్ధులు వారి కుటుంబసభ్యుల నుంచి ఆర్దిక సాయాన్ని అందుకునే వరకు ఆరు రోజుల పాటు సాయాన్ని అందిస్తామని ఆయా సంఘాలు విజ్ఞప్తి చేశాయి. విద్యార్ధులు, ఇతర భారతీయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపాయి. 

ఆసరాగా నిలిచిన  సంఘాలు

* తెలంగాణ  ఎన్నారై  ఫోరమ్
* తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్
* తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్
* యుక్త
* వాసవి క్లబ్ ఇంగ్లాండ్
* తెలంగాణ జాగృతి
* ఒయాసిస్ అకౌంట్స్
* హైదరాబాద్ బావార్చి
* యూకే బీజేపీ

 

click me!