భారతీయ మహిళకు జో బైడెన్ కీలక పదవి..!

By telugu news teamFirst Published Jul 1, 2021, 9:33 AM IST
Highlights

 సుప్రీంకోర్టు సర్క్యూట్ కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 

భారత సంతతి మహిళకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక పదవి అప్పగించారు. మిచిగాన్‌ తూర్పు జిల్లా ఫెడరల్‌ జడ్జిగా ఇండో అమెరికన్‌, సర్క్యూట్‌ కోర్టు చీఫ్‌ జడ్జి షలీనా డీ కుమార్‌ను నామినేట్‌ చేసినట్లు వైట్‌హౌస్‌ బుధవారం ప్రకటించింది. షలీనా డీ కుమార్ 2007 నుంచి ఓక్లాండ్ కౌంటీ 6వ సర్క్యూట్ కోర్టులో పనిచేశారు. 

ఆమెను 2018 జనవరిలో మిచిగాన్ సుప్రీంకోర్టు సర్క్యూట్ కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మిచిగాన్‌లో దక్షిణాసియా సంతతికి చెందిన మొదటి ఫెడరల్ న్యాయమూర్తి షలీనా అని వైట్ హౌస్ తెలిపింది. 

ఆమె బెంచ్‌లో ఉన్న సమయంలో అడల్ట్‌ ట్రీట్‌మెంట్‌ కోర్టు ప్రిసైడింగ్‌ జడ్జిగా, ఓక్లాండ్‌ కౌంటీ క్రిమినల్‌ అసైన్‌మెంట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా, ఓక్లాండ్‌ కౌంటీ బార్‌ అసోసియేషన్‌ సర్క్యూట్ కోర్టు కమిటీకి బెంచ్ అనుసంధానకర్తగా, స్టేట్ బార్ ప్రొఫెషనలిజం కమిటీ, మిచిగాన్ న్యాయమూర్తుల సంఘం కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలిగా సేవలందించారు. 

షలీనా 1993లో మిచిగాన్ విశ్వవిద్యాలయం, 1996లో డెట్రాయిట్ మెర్సీ స్కూల్ ఆఫ్ లా నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. న్యాయమూర్తి జీన్ ష్నెల్జ్ పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి మిచిగాన్‌లోని ఓక్లాండ్ కౌంటీలోని 6వ సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తిగా 2007లో నియమితులయ్యారు.

click me!